దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో విల్ జాక్స్ విధ్వంసమే సృష్టించాడు. 41 బంతుల్లోనే సెంచరీ చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 8 ఫోర్లు, 9 సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. మొత్తం 42 బంతుల్లో 101 పరుగులు చేసిన జాక్స్ జట్టు స్కోర్ లో ఒక్కడే 50 శాతం పరుగులు చేశాడు. జాక్స్ ఇంగ్లాండ్ ప్లేయర్ అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్ ఇండియన్ ఫ్యాన్స్ కు తెగ కిక్ ఇస్తుంది. దానికి కారణం జాక్స్ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ జట్టు తరపున ఆడటమే.
జాక్స్ ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో ఉన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో ఒక్క టైటిల్ కూడా సాధించని ఆ జట్టు ఈ ఇంగ్లాండ్ ప్లేయర్ మీద భారీ ఆశలే పెట్టుకుంది. జాక్స్ ఇన్నింగ్స్ చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ ఆ జట్టుకు మెరుపు ఇన్నింగ్స్ లు ఆడతాడని ధీమా వ్యక్త చేస్తున్నారు. 41 బంతుల్లో సెంచరీ చేయడమే కాకుండా బౌలింగ్ లో 3 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేకపోయినా విల్ జాక్వెస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఇంగ్లీష్ ప్లేయర్.. తర్వాత 50 పరుగుల మార్క్ చేరుకోవడానికి 18 బంతులు మాత్రమే అవసరమయ్యాయి. విల్ జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ తో మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జయింట్స్ 20 ఓవర్లలో 187 పరుగులకే పరిమితమైంది. మూడు మ్యాచ్ లాడిన ప్రిటోరియస్ కు ఇదే తొలి విజయం.
The Madness of Will Jacks....!!!!
— Johns. (@CricCrazyJohns) January 18, 2024
- Will Jacks smashed 101 runs from just 42 balls in SA20, A player to watch in RCB in coming IPL seasons. pic.twitter.com/jKYMKWCR1i