SA20, 2024: 108 మీటర్ల సిక్స్..బంతిని స్టేడియం బయటకు పంపిన ఆర్సీబీ ప్లేయర్

SA20, 2024: 108 మీటర్ల సిక్స్..బంతిని స్టేడియం బయటకు పంపిన ఆర్సీబీ ప్లేయర్

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ఇంగ్లాండ్ ఆటగాడు విల్ జాక్స్ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఇటీవలే 41 బంతుల్లో సెంచరీ చేసిన ఈ ఇంగ్లీష్ వీరుడు తాజాగా ఒక భారీ సిక్సర్ తో ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్య పరిచాడు. ఏకంగా 108 మీటర్ల సిక్సర్ కొడుతూ వావ్ అనిపించాడు. ఈ మ్యాచ్ లో తమ జట్టు ప్రిటోరియా క్యాపిటల్స్ ఓడిపోయినా జాక్స్ కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది. 

ఏడో ఓవర్ కీమో పాల్ తొలి బంతిని షార్ట్ వేయగా.. బ్యాక్ వార్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా జాక్స్ గట్టిగా కొట్టాడు. ఈ బంతి రూఫ్ ను తాకి అటు గుండా స్టేడియం ధాటి పోయింది. మొత్తం 26 బంతుల్లో 41 పరుగులు చేసిన జాక్స్..జూనియర్ డాలా బౌలింగ్ లో ఔటయ్యాడు. జాక్స్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 భారీ సిక్సరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆర్సీబీ స్క్వాడ్ లో ఉన్నాడు. దీంతో జాక్స్ మెరుపు హిట్టింగ్ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సారి రాయల్ చాలెంజర్స్ జట్టులో కీ రోల్ ప్లే చేస్తాడని నమ్ముతున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కే 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్లాసన్ 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. లక్ష్య ఛేదనలో ప్రిటోరియ క్యాపిటల్స్ 166 పరుగులకే పరిమితమైంది. 41 పరుగులు చేసిన జాక్స్ టాప్ స్కోరర్. మిగిలిన ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.