అసెంబ్లీకి వస్తారా..? లేదా..?.. తొలిరోజు అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా

అసెంబ్లీకి వస్తారా..? లేదా..?.. తొలిరోజు అసెంబ్లీకి కేసీఆర్ డుమ్మా
  • బీఏసీ మీటింగ్ కు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి
  • రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి
  • సార్ వస్తారో..? లేదో చెప్పం అన్న హరీశ్
  • అది మా స్ట్రాటజీ అంటూ దాటవేత
  • కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్
  • ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు డుమ్మా

హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా..? లేదా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సారి అసెంబ్లీకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇవాళ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఏసీ సమావేశానికి ఆయనే హాజరవుతారని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. 

సమావేశాల ఎజెండాపై చర్చించారు. అయితే కేసీఆర్ మాత్రం మధ్యాహ్నం తర్వాత తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి హాజరై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కొందరు  పార్టీ నేతలు మాత్రం బడ్జెట్ రోజు అసెంబ్లీకి వస్తారని చెబుతున్నారు. అయితే నిన్న హరీశ్ రావు మీడియాతో చేసిన చిట్ చాట్ లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో లేదో..? చెప్పం.. అది మా స్ట్రాటజీ అంటూ దాటవేశారు. 

ఇవాళ మధ్యాహ్నం తర్వాత తెలంగాణ భవన్ లో ఎల్పీ మీటింగ్ నిర్వహించిన కేసీఆర్ తొమ్మిది అంశాలపై సభలో చర్చించాలని సూచించారు. అయితే ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు.  ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఆలస్యంగా సమావేశానికి వచ్చారు. 

Also Read:-రోస్టర్ సిస్టంపై వెనక్కి

 స్వయంగా పార్టీ చీఫ్ కేసీఆర్ హాజరైన సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎల్పీ సమావేశానికి గైర్హాజరైన వారిలో కొందరు పార్టీ మారబోతున్నట్లు గత కొంత కాలంగా పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

గైర్హాజరైన ఎమ్మెల్యేలు
మాణిక్ రావు    జహీరాబాద్ (అనారోగ్యం కారణంగా..)
కొత్త ప్రభాకర్ రెడ్డి     దుబ్బాక
బండారు లక్ష్మారెడ్డి    ఉప్పల్
పద్మారావుగౌడ్    సికింద్రాబాద్
తలసాని         సనత్ నగర్

ఎమ్మెల్సీలు
చల్లా వెంకట్రాంరెడ్డి