అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పిట్లం, వెలుగు: ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మంగళవారం పిట్లం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
సాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయడానికి రూ. 476 కోట్లతో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం పిట్లంలో పంచాయతీలకు స్పోర్ట్స్కిట్లు పంపిణీ చేశారు. పిట్లంలో సెంట్రల్ లైటింగ్పనులకు, పిట్లం నుంచి సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలానికి నిర్మించే రోడ్డు పనులను ప్రారంభించారు.
తిమ్మానగర్, మార్దండ, కంభాపూర్, చిన్నకొడప్గల్, పోతిరెడ్డిపల్లి, రాంపూర్, గౌరారం గ్రామాల్లో మన ఊరు మన బడిలో నిర్మించిన కొత్త గదులు, బ్రిడ్జి పనులకు, గౌరారం తండాలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, విజయ్, జడ్పీటీసీ అరికెల శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్మండలాధ్యక్షుడు వాసరి రమేశ్, సాయిరెడ్డి పాల్గొన్నారు.