10 వేల కోట్లిచ్చినా ఎన్ఈపీకి ఒప్పుకోం: కేంద్రానికి తేల్చి చెప్పిన స్టాలిన్

10 వేల కోట్లిచ్చినా ఎన్ఈపీకి ఒప్పుకోం: కేంద్రానికి తేల్చి చెప్పిన స్టాలిన్

చెన్నై: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌‌‌‌ఈపీ)ని అమలు చెయ్యబోమని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ఎన్‌‌‌‌ఈపీ ‘విధ్వంసకర నాగ్‌‌‌‌పూర్ ప్లాన్’ అని విమర్శించారు. చెంగళ్‌‌‌‌పట్టులో మంగళ వారం నిర్వహించిన కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడారు. ‘‘మీరంతా నిన్న టీవీలో పార్లమెంట్ సమావేశాలు చూసి ఉంటారు. 

హిందీ, సంస్కృతాన్ని అంగీకరిస్తేనే తమిళనాడుకు రూ.2 వేల కోట్లు ఇస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అహంకారంతో మాట్లాడారు. ఎన్‌‌‌‌ఈపీని అమలు చేస్తేనే రాష్ట్రానికి నిధులు ఇస్తామని బ్లాక్‌‌‌‌మెయిల్ చేస్తు న్నారు. కానీ ఎన్ఈపీని అమలుచేయం. రూ.10 వేల కోట్లు ఇచ్చినా అందుకు ఒప్పుకోం” అని స్టాలిన్ చెప్పారు.