బడ్జెట్లో పెట్రోల్, డీజిటల్ ధరలు తగ్గనున్నాయా : సీఐఐ డిమాండ్ ఏం చెబుతోంది..!

బడ్జెట్లో పెట్రోల్, డీజిటల్ ధరలు తగ్గనున్నాయా : సీఐఐ డిమాండ్ ఏం చెబుతోంది..!

బడ్జెట్ 2025 విడుదల కాబోతున్నది..మరికొన్ని గంటల్లో జనం ముందుకు వచ్చేస్తుంది..ఏ ధరలు పెరుగుతాయి..ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనేది సస్పెన్స్..కాకపోతే కొన్ని డిమాండ్లు మాత్రం కేంద్రం దగ్గర గట్టిగా పెట్టాయి ఆయా సంఘాలు..అసోసియేషన్స్.. ఈ క్రమంలోనే CII..కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రధానంగా ఓ డిమాండ్ ను కేంద్రం ఎదుట ఉంచింది. బడ్జెట్ లో ఇంధన ధరలపై సుంకాలు తగ్గించాలని డిమాండ్ చేస్తుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి.. ఉత్పాదక శక్తి పెరిగి.. కంపెనీలకు భారం తగ్గుతుందని స్పష్టం చేస్తుంది. 

పెట్రోల్ పై 21 శాతం, డీజిల్ పై 18 శాతం సెంట్రల్ ఎక్సైజ్ పన్ను విధిస్తున్నారని.. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం భారీ పన్ను వేస్తుండటంతో.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉన్నాయని.. దీని వల్ల కంపెనీలపై భారం పడుతుందని సీఐఐ కేంద్రానికి లేఖ రాసింది. 2022 నుంచి ప్రపంచ క్రూడ్ ఆయిల్ ధరలు 40 శాతం తగ్గాయని.. అందుకు అనుగుణంగా ధరలు తగ్గలేదన్న విషయాన్ని ప్రస్తావించింది సీఐఐ. ద్రవ్యోల్బణం అదుపు చేయటానికి.. ధరలు తగ్గి.. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది సీఐఐ. 

Also Read : కేంద్ర​ బడ్జెట్ 2025 : మూల ధన వ్యయం అంటే ఏంటి.?

భారతదేశ ఆర్థిక వృద్ధి ఇంధన వినియోగం చాలా కీలకం అని.. వినియోగదారుల కొనుగోలు శక్తిని ఇంధన ధరలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ అన్నారు. 2025 బడ్జెట్ లో ఇంధన ధరలపై సుంకాన్ని తగ్గించటం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి.. ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుందని.. ప్రపంచ క్రూడ్ ఆయిల్ ధరలు సైతం 40 శాతం తగ్గినా.. అందుకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారాయన.

ఈ క్రమంలోనే బడ్జెట్ లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా లేదా అనేది ఆసక్తిగా మారింది.. ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది.