పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా..!: పెట్రోలియం శాఖ ఏమంటోంది..?

పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా..!: పెట్రోలియం శాఖ ఏమంటోంది..?

పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గునున్నాయా?..పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గుతాయి?..తగ్గితే ఎంత తగ్గుతాయి?..ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలపై ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇందుకు కారణం లేకపోలేదు..గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిలు ధరల తగ్గుదల,పెట్రోలియం శాఖ అధికారుల అనధికార స్టేట్ మెంట్లు..పెట్రోల్ ధరల తగ్గుదల ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి.గతవారం గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ దర 70 USD కంటే తక్కువకు పడిపోయాయి. 2021 డిసెంబర్ తర్వాత క్రూడ్ ఆయిల్ ధరలు ఇంతలా పడిపోవడం ఇదే మొదటి సారి. 

ముడిచమురు ధరలు భారీగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని అంచనా. గత రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి ఈ క్రమంలో డీజిల్, పెట్రోల రేట్ల తగ్గింపుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. 

Also Read :- పండగ చేస్కోండి : అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు

మరోవైపు మహారాష్ట్రలో అసెంబ్లీ కి ఎన్నికలున్నందున.. కేంద్రం నజరానాగా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే అవకాశం ఉండొచ్చని పెట్రోలియం శాఖ లో ఓ సీనియర్ అధికారులు  చెబుతున్నారు. 

2022 ఏప్రిల్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను స్థిరంగా ఉంచిన కేంద్రం..2024 సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్ పై లీటరుకు రూ. 2 లు తగ్గించింది.  దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72 కాగా డీజిల్ ధర రూ.87.62గా ఉంది. ఇక తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.109 గా ఉంది.  

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నట్లయితే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంపై చమురు కంపెనీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పెట్రో లియం శాఖలో కొందరు అధికారులు చెబుతున్నారు.