ఆసీస్ దేశవాళీ టోర్నీలో తీవ్ర విషాదం.. ప్లేయర్ తలకు తగిలిన బంతి

ఆసీస్ దేశవాళీ టోర్నీలో తీవ్ర విషాదం.. ప్లేయర్ తలకు తగిలిన బంతి

ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యువ బ్యాటర్ విల్ పుకోవ్ స్కీ తలకు బంతి బలంగా తాకింది. దేశవాళీ టోర్ని షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో పుకోవ్ స్కీ విక్టోరియా తరుపున ఆడుతున్నాడు. టాస్మేనియాతో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చి తాను ఎదుర్కొన్న రెండో బంతికే కంకషన్ కు గురైయ్యాడు.

టాస్మేనియా బౌలర్ రిలే మెరెడిత్ వేసిన బౌన్సర్ వేగంగా దూసుకొచ్చి పుకోవ్ స్కీ హెల్మెట్ కు ఎడమ వైపు బంతి తగిలింది. బంతి తగలగానే వెంటనే గ్రౌండ్ లోనే కుప్పకులాడు. ఈ సమయంలో అతని చూపు మందగించింది. తన కళ్ళను రుద్ధుకుంటూ కనిపించాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా అందరూ ఏం జరిగిందో అని కంగారు పడ్డారు.  వైద్య సిబ్బంది వచ్చి అతనిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్ళారు. ప్రస్తుతం అతను వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నాడు. త్వరలోనే అతని పరిస్థతి గురించి మరింత సమాచారం అందిస్తామని విక్టోరియా ప్రతినిధి తెలిపారు. 

Also Read :IPL 2024: 20 కోట్ల ఆటగాడికే ఓటు: సన్ రైజర్స్ కొత్త కెప్టెన్‌గా కమ్మిన్స్

పుకోవ్‌స్కీ స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా క్యాంప్‌బెల్‌ కెలావే క్రీజులోకి వచ్చాడు. పుకోవ్  స్కీ మానసిక ఆరోగ్యంతో భాద పడుతున్నట్టు ఒక ప్రకటనలో తెలిపాడు. పుకోవ్‌స్కీ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో కేవలం ఒక్క మ్యాచ్ ఆడాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 72 పరుగులు చేశాడు.