ఏంటీ.. ఆర్.ఆర్.ఆర్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ రైట్స్ రూ.250 కోట్లా..?

ఏంటీ.. ఆర్.ఆర్.ఆర్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ రైట్స్ రూ.250 కోట్లా..?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓటమిలేనటువంటి దర్శకులెవరంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు స్టార్ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి. అయితే ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. అంతేకాదు సినిమా సినిమాకి వ్యత్యాసం చూపిస్తూ తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చెయ్యడమేకాకుండా సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా మార్చేశాడు. 

అయితే రాజమౌళి తీసిన మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపుగా రూ.1200 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ పై తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ డిసెంబర్ 20న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది.

ALSO READ | Netflix Trending Movies: నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమాలు..

ఇందులో ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ సమయంలో అనుభవాల్ని, మెమొరీస్ ని చూపించారు. దీంతో ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుందని చెప్పవచు. ఐతే ఆర్.ఆర్.ఆర్ డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.250 కోట్లు బడ్జెట్ వెచ్చించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు. మాములుగా జక్కన్న సినిమాల బడ్జెట్ కూడా రూ.300 నుంచి రూ.400 కోట్లు ఉంటుంది. కానీ డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ వెచ్చించడం ఇదే మొదటిసారి.

ఈ విషయం ఇలా ఉండగా ఆర్.ఆర్.ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న  జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తన నెక్ట్స్ సినిమా మహేష్ బాబుతో చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ కోసం శనివారం రాజమౌళి తన టీమ్ తో కలసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 3 రోజులపాటు ఓడిశాలోని దేవ్‌ మాలి, తోలో మాలి, కోలా బ్, పుట్ సీల్ ప్రాంతాలలో జక్కన్న టీమ్ షూటింగ్ లొకేషన్స్ వేట మొదలుపెట్టినట్లు సమాచారం.