IPL 2024: వేగంగా కదులుతోన్న తుఫాన్.. SRH vs RR వాతావరణ అప్‌డేట్ ఇదే

ఐపీఎల్ పదిహేడో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక రెండే మ్యాచ్‌లు మిగిలివున్నాయి. శుక్రవారం(మే 24) సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య రెండో క్వాలిఫయర్‌ జరగనుండగా.. మే26న, ఆదివారం నాడు ఫైనల్ పోరు జరగనుంది. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉండటంతో క్వాలిఫయర్‌ -2 పోరుపై అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కీలక మ్యాచ్ ఎక్కడ వర్షార్పణం అవుతుందో అని భయపడుతున్నారు. ఈ క్రమంలో SRH vs RR మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా..! లేదా..! అనేది తెలుసుకుందాం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా బలపడి ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. ఇప్పటికే ఈ తుఫానుకు 'రెమాల్'గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలైన మిజోరాం, త్రిపుర, మణిపూర్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఈ తుఫాన్ ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై ఏమాత్రం లేదు. మాడు పగిలేలా ఎండలు మండిపోతాయని ఐఎండీ స్పష్టం చేసింది. కావున అభిమానులు ఎంటర్టైన్‌కు ఎలాంటి ఆటంకాలు లేవు. 

వేడి.. ఉక్కపోత

చెన్నై నేటి వాతావరణం విషయానికొస్తే.. మ్యాచ్‌కు 90 నిమిషాల ముందు అనగా సాయంత్రం 6 గంటల సమయంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు 1 నుండి 3 శాతం మాత్రమే. ఇది చాలా తక్కువ. అయితే మే 26న రెమాల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున ఫైనల్‌కు అంతరాయం కలిగించవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, పాయింట్ల పట్టికలో మెరుగైన(రరెండు) స్థానంలో ఉన్న SRH ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.