అప్పులు100 శాతం కట్టేస్తా: విజయ్‌మాల్య

అప్పులు100 శాతం కట్టేస్తా: విజయ్‌మాల్య
  • రిలీఫ్‌ ప్యాకేజ్‌ను సపోర్ట్‌ చేస్తున్నట్లు ట్వీట్‌

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను 100 శాతం చెల్లిస్తానని లిక్కర్‌‌ టైకూన్‌, ప్రముఖ వ్యాపార వేత్త విజయ్‌ మాల్య ప్రకటించారు. తన అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. అప్పులు కట్టించుకుని తనపై ఉన్న కేసులను కొట్టేయాలని కోరారు. రుణాలు చెల్లిస్తానని పదే పదే చెప్పినా బ్యాంకులు విస్మరించాయని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీ బాగుందని అన్నారు. “ కొవిడ్‌ 19 రిలీఫ్‌ ప్యాకేజ్‌ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వాళ్లు ఎన్ని నోట్లు అయినా ముద్రించగలరు. కానీ ప్రభుత్వం బ్యాంకుల్లో ఉన్న నా అప్పులను 100 శాతం కట్టేస్తాను. నేను కడతానన్న ప్రతిసారి ఇగ్నోర్‌‌ చేస్తున్నారు” అని మాల్యా ట్వీట్‌ చేశారు. మన దేశంలోని వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.9వేల కోట్లు అప్పులు చేసిన విజయ్‌ మాల్య 2016లో విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉంటున్నారు. విజయ్‌మాల్యాను తిరిగి ఇక్కడకు రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాగా.. దాన్ని అడ్డుకునేందుకు మాల్య కోర్టును ఆశ్రయించారు.