- హామీ ఇచ్చి పట్టించుకోని గత బీఆర్ఎస్ సర్కార్
- లైట్ తీసుకున్న నాటి మంత్రులు, లీడర్లు
- కాగితాల దశలోనే ఆగిపోయిన ఏర్పాటు ప్రపోజల్స్
- తాజాగా గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ చేస్తామన్న సీఎం
- వరంగల్ లోనూ నిర్మించాలంటున్న జిల్లా క్రీడాకారులు
హనుమకొండ, వెలుగు: జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటేలా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఓరుగల్లులో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేస్తామని గత బీఆర్ ఎస్ సర్కార్ హామీ ఇవ్వగా కలగానే మిగిలింది. ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపగా.. మంత్రులు, లీడర్లు లైట్ గా తీసుకోగా కాగితాలకే పరిమితమైంది. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ ను కూడా పరిశీలించాలంటూ క్రీడాకారుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అర్జున అవార్డు గ్రహీత, దివంగత పిచ్చయ్య, కోచ్ నాగపురి రమేశ్, పారా అథ్లెట్జివాంజీ దీప్తి వంటి ఎందరో క్రీడాకారులు ఓరుగల్లు నుంచే అంతర్జాతీయంగా ఎదిగారు. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఉండగా.. క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్విలేజ్ఏర్పాటు గత ప్రభుత్వంలో లీడర్లు హామీ ఇచ్చారు. ప్రపోజల్స్ పంపాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్అథారిటీ ఖేలో ఇండియా స్కీమ్ కింద స్పోర్ట్స్ విలేజ్మంజూరుతో పాటు వంద ఎకరాల భూమి కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. మల్టీపర్పస్ఇండోర్స్టేడియంతో పాటు హాస్టల్బిల్డింగ్స్, వివిధ స్పోర్ట్స్కోర్టులు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కు రూ.100 కోట్ల నిధులు అవసరమవుతాయని కూడా అంచనా వేశారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో స్థల పరిశీలన
వరంగల్ లో స్పోర్ట్స్విలేజ్ నిర్మాణానికి సిటీకి 20 కిలోమీటర్ల దూరంలోని హసన్‌పర్తి మండలం మడిపల్లి, అనంతసాగర్, జయగిరి గ్రామాల శివారులో అధికారులు స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఇన్నర్రింగ్రోడ్డుకు 5 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు స్థలం ఉండగా.. రవాణా సౌకర్యాలతో పాటు ట్రాఫిక్ఇబ్బందులు కూడా తలెత్తవని భావించారు. మడిపల్లి శివారు 304 సర్వే నం.లో 187.01 ఎకరాలు, జయగిరి శివారు సర్వే నం. 225 లో 51.29 ఎకరాలు, అనంతసాగర్శివారు సర్వే నం. 541లో 66 ఎకరాలు మొత్తంగా.. 305.08 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని గుర్తించారు. అందులో దాదాపు 200 ఎకరాల ల్యాండ్ 'కుడా' తీసుకుని' మా సిటీ' వెంచర్ డెవలప్ చేయగా, మిగిలిన భూమిని స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటుకు ఇవ్వాలని అధికారులు ప్రపోజల్స్ పెట్టారు. ల్యాండ్ కేటాయింపుపై లీడర్లు లైట్తీసుకోవడంతో కాగితాల దశలోనే నిలిచిపోయింది.
ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని..
2021 సెప్టెంబర్‌లో హనుమకొండలోని జేఎన్ఎస్లో నేషనల్ఓపెన్అథ్లెటిక్స్చాంపియన్ షిప్‌పోటీలు జరిగాయి. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా నాటి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, లీడర్లు హాజరై స్పోర్ట్స్విలేజ్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. డీపీఆర్ సిద్ధం చేస్తే.. ప్రభుత్వానికి విన్నవిస్తామని సూచించారు. కానీ.. ఆ తర్వాత పట్టించుకోలేదు. స్పోర్ట్స్విలేజ్ఏర్పాటు అటకెక్కింది. వరంగల్ లో కూడా స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేసి, క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకుని స్పోర్ట్స్ విలేజ్మంజూరు చేయించేందుకు కృషి చేయాలని డిమాండ్చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఏర్పాటుకు చర్యలు
గతంలోనే స్పోర్ట్స్విలేజ్ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కానీ.. దానికి సరిపడా ల్యాండ్ కేటాయింపు జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే వరంగల్ లో స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం.
– గుగులోత్ అశోక్‌కుమార్, డీవైఎస్వో, హనుమకొండ