చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సెగ్మెంట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ చేవెళ్ల సెగ్మెంట్ ఇన్చార్జి పామెన భీం భరత్ ఆధ్వర్యంలో నాయకులు సెక్రటేరియట్లో మంత్రిని కలిశారు. ఆమెను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. చేవెళ్ల సెగ్మెంట్ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఆమెను కలిసిన వారిలో సమన్వయ కమిటీ చైర్మన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, చేవెళ్ల సెగ్మెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటా రెడ్డి తదితరులు ఉన్నారు.