విజయ్ని గెలిపిస్తా.. పాపులారిటీలో ధోనిని మించిపోతా: ప్రశాంత్ కిషోర్

విజయ్ని గెలిపిస్తా.. పాపులారిటీలో ధోనిని మించిపోతా: ప్రశాంత్ కిషోర్

పాపులారిటీలో ధోనిని మించిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే కోసం పనిచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన పీకే ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ( ఫిబ్రవరి 26, 2025 ) మహాబలిపురంలో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ధోనికి తమిళనాడులో చాలా పాపులారిటీ ఉందని..తనకంటే పాపులారిటీ ఉన్న బిహారి ధోని ఒక్కడే అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీవీకే విజయానికి కృషి చేస్తానని.. విజయ్ ని గెలిపించి పాపులారిటీలో ధోనిని మించిపోతానని అన్నారు పీకే. రాబోయే ఎన్నికల్లో విజయ్ ని గెలిపిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ని గెలిపించిన ధోని పాపులర్ అవుతారా లేక విజయ్ ని గెలిపించిన పీకే పాపులర్ అవుతారా అని టీవీకే కార్యకర్తలను ప్రశ్నించారు పీకే.

తమిళనాడులో ధోని కంటే పాపులర్ బీహారీ అవ్వడమే తన ముందున్న ఛాలెంజ్ అని.. ధోని చెన్నై సూపర్ కింగ్స్ ని గెలిపిస్తే, తాను టీవీకే నాయకులను గెలిపిస్తానని అన్నారు పీకే. 

2021లో పొలిటికల్ కన్సల్టింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన పీకే.. ఆ తర్వాత జన సురాజ్ పేరిట సొంత పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ కన్సల్టెంట్ గా రీఎంట్రీ ఇచ్చిన పీకే.. టీవీకేను కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక "ఉద్యమం"గా భావిస్తున్నానని అన్నారు.