ల్యూవ్యూ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాను సమగ్ర శాంతి చర్చలకు ఆహ్వానించారు. అలాగే బయటి దేశాల్లో ఉంటూ తమ దగ్గర ఉన్న డబ్బు బలంతో ఉక్రెయిన్ పై స్వదేశాన్ని ఉసిగొల్పుతున్న రష్యన్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి రష్యన్లపై చర్యలు తీసుకోవాలని స్విట్జర్లాండ్ ను కోరారు. వార్ కోసం డబ్బులను ఫండింగ్ చేస్తున్న వారి అకౌంట్లను స్విస్ బ్యాంకులు ఫ్రీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాలని, తమతో సంధి చేసుకోవాలన్నారు. ‘నా మాటల్ని శ్రద్ధగా వినాలని మాస్కోను కోరుతున్నా.. మీటింగ్ కు, చర్చలకు సమయం ఆసన్నమైంది. ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించి, ఉక్రెయిన్ కు న్యాయం చేయాల్సిన టైమ్ వచ్చింది. ఇలా చేయకపోతే, రష్యా తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. వాళ్లు తిరిగి కోలుకోవడానికి కొన్ని తరాలు పడుతుంది’ అని జెలెన్స్కీ హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం: