వర్క్లైఫ్ బ్యాలెన్స్పై నమ్మకంలేదు అంటున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..టెకీలు ఏమంటున్నారంటే

వర్క్లైఫ్ బ్యాలెన్స్పై నమ్మకంలేదు అంటున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..టెకీలు ఏమంటున్నారంటే
  • వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై నాకు నమ్మకం లేదంటున్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
  • వారానికి ఆరు రోజులు పనిచేయాలని సూచన 
  • నా అభిప్రాయాన్ని మార్చుకోలేను..ఇది నాతోపాటు నా సమాధికి వస్తుందని కీలక వ్యాఖ్యలు 

వర్క్ లైఫ్ బ్యాలెన్స్పై నాకు నమ్మకం లేదు..ఈ దేశంలో మనం కష్టపడి పనిచేయాలి..మీరు చాలా తెలివైన వ్యక్తి అయినప్పటికీ కష్టానికి ప్రత్యామ్నాయం లేదు..నేను వారానికి ఆరు రోజుల పని విధానాన్ని సమర్థిస్తాను. నన్ను క్షమించండి..నేను నా అభిప్రాయాన్ని మార్చుకోలేను..దీన్ని నాతోపాటు నా సమాధికి తీసుకెళ్తాను’’ అని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ మూర్తి గతంలో కూడా ఇలాంటి వాదనే చేశారు. వారానికి 70గంటల పనివిధానాన్ని సూచించారు.అప్పుడు విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో నారాయణమూర్తి వ్యాఖ్యలతో పనికి, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంపై ఉద్యోగుల్లో అనేక సందేహాలు, ఆయన సూచించిన విధానం ప్రభావంపై చర్చనీ యాంశ మైంది. 

ఒకప్పుడు ఐటీ కంపెనీల్లో ఉద్యోగులంతా వారం రోజులు, వారాంతాల్లో ఇల్లు, ఆఫీసుల్లో ఎలా వర్క్ చేస్తున్నారో చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీలయ్యేవారు. ఉద్యోగులు, నిర్వాహకులు అర్థరాత్రి వరకు పనిచేసేందుకు డెస్క్ లకు సంకెళ్లు వేసుకొని పనిచేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. చాలా మంది ఉద్యోగులు వృత్తి- వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. 

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే..

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే..వృత్తిపరమైన కట్టుబాట్లు, వ్యక్తిగత జీవితాల మధ్య బ్యాలెన్స్ కోసం వెతకడం. కొంతమంది ఉద్యోగులు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ మోడ్ను ఫా లో అవుతుంటారు. ఇది వారికి వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్సింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.ఆఫీసునుంచి బయటికి వచ్చిన క్షణం స్విచ్ ఆఫ్ చేసి, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మిగతా సమయాన్ని ఆస్వాదించగలిగితే మరుసటి రోజు వర్క్ మోడ్ లోకి వెళ్లినట్లయితే మీ వ్యక్తిగీత, వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకోవడంలో మీరు విజయం సాధించవచ్చంటున్నారు. 

ALSO READ | ఓబీసీ అని చెప్పుకునే మోడీ.. పదేళ్లలో వాళ్లకు చేసిందేమి లేదు: రాహుల్ గాంధీ

అయితే స్విచ్ ఆఫ్..స్విచ్ ఆన్ ఫ్లిప్ చేయడం అనేది అంత సులభమేనా.. అంటే చాలా మంది ఉద్యోగులు ఇలా చెబుతున్నారు. అనువైన పనిగంటలు, ప్రయాణానికి తక్కువ సమయం, పాజిటివ్ యాజమాని వంటి పరిస్థితులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను సాధించడంలో సహాయపడగలవని చెపుతున్నారు.మీ ఆరోగ్యంపై శ్రేయస్సుపై దృష్టి సారించే పరిస్థితులున్న ఆఫీసు వాతావరణం, యాజమాన్యం ఉన్నప్పుడు.. నేర్చుకోవడం, వృద్ధి అవకాశాలను ప్రోత్సహిస్తుంది. పని ఒత్తిడిని గుర్తించి, బర్న్ అవుట్ ను నివారించే చర్యలు తీసుకోగలిగితే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా సులభం అవుతుందంటున్నారు కొంతమంది ఉద్యోగులు. 

గతంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఉత్పాదకతను పెంచేందుకు యువ భారత్ ను వారంలో 70 గంటల పనిచేయాలని సూచించారు. ఆయన మాటలతో సోషల్ మీడియాలో మిశ్రమ ప్రతిస్పందనలు వచ్చాయి.పటిష్టమైన పని నీతి కోసం ఆయన చేసిన పిలుపుకు కొందరు మద్దతిస్తే, మరికొందరు దాని సాధ్యత, ఆరోగ్యం, శ్రేయస్సుపై దాని ప్రభావాన్ని ప్రశ్నించారు.మూర్తి ఈ ప్రతిస్పందనను నేరుగా ప్రస్తావించారు స్థిరమైన కృషి ప్రాముఖ్యతపై విమర్శలు తన అభిప్రాయాన్ని మార్చవని చెప్పడం తాజా చర్చనీయాంశమైంది.