సర్జికల్ స్ట్రైక్స్ ఓట్లు తెస్తాయా?

మోడీఅమిత్జోడీకి 2018 సెకండాఫ్లో అన్నీ ఎదురు దెబ్బలే. త్రిపురలో గెలిచామన్నసంబురం ఆరు నెలలకే ఆవిరైపోయింది. మూడు కీలక రాష్ట్రా ల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌‌ జెండా ఎగరేసింది. అప్పటి వరకు వచ్చిన విజయోత్సాహం తగ్గిపోయింది. కొత్త నినాదాలకోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఎదురైంది. అలాంటి సమయంలో పుల్వామాలో సూసైడ్‌‌ బాంబర్‌‌ జరిపిన దాడి కలిసొచ్చింది. దేశ భద్రతకు పెద్దప్రమాదం ఎదురైందన్న సెం టిమెంట్ ను జనం ముందుకు తీసుకెళ్లింది. సర్జికల్ స్ట్రైక్ తోదాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేసింది.

నరేంద్ర మోడీ అధికారానికివచ్చి న తర్వాత నాలుగున్నరేళ్ల కాలం తరచు విదేశీ పర్యటనలు చేశారు. లేదంటే తన సొంతరాష్టమై న గుజరాత్‌‌‌‌, తమ పార్టీకిముఖ్య రాష్టమై న ఉత్తర ప్రదేశ్‌‌‌‌, పార్టీతీసుకున్న ‘లుక్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌’ లైన్‌‌‌‌ ప్రకారం ఈశాన్య రాష్ట్రాలు తిరిగారు. డీమానిటైజేషన్‌‌‌‌ తర్వాత 2017లో జరిగిన ఉత్తర ప్రదేశ్‌‌‌‌ ఎన్నికల్లో ప్రభుత్వాన్నిదక్కించుకున్నా క… క్రమంగా మోడీ పలుకుబడి తగ్గసాగింది. అదే ఏడాది చివరలో జరిగిన గుజరాత్‌‌‌‌ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పింది. మేజిక్‌‌‌‌ ఫిగర్‌‌‌‌ 91కంటే తొమ్మిది సీట్లు ఎక్కువ తెచ్చుకుని అధికారాన్నినిలబెట్టుకోగలిగింది.2019 ప్రవేశించే నాటికి కేంద్రం లోని అధికార ఎన్‌‌‌‌డీఏ పరిస్థితి ఏమంత బాగా లేదు. ఈ అలయెన్స్‌‌‌‌లో ఎవరుంటారో, ఎవరు అలిగి వెళ్లిపోతారో తెలియని అయోమయం నెలకొంది.

బీజేపీకూటమిలో జాతీయత, ప్రజాస్వామ్యం లేవన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. బీజేపీ ఒక దశలో కేవలంమోడీ ఇన్‌‌‌‌ఫ్లూయెన్స్‌‌‌‌ని , హిందూత్వ ఎజెండానినమ్ముకుని ఓట్లకోసం వెళ్తే కుదరదని భావిం చింది.ప్రాంతీ యంగా తమ బలం సన్నగిల్లే ప్రమాదాన్నిఊహించింది. కొత్త నేపథ్యం కోసం హిందూత్వని పక్కనబెట్టి, బడుగు బలహీన వర్గాల ఓటు బ్యాంకు పై దృష్టిపెట్టిం ది. దళిత హిందువులను, హిందువుల్లో బాగావెనకబడిన వర్గా లను ఆకట్టుకోవడానికి పార్లమెంటుని ఆసరా చేసుకుంది. దళితులు, గిరిజనులపై అట్రాసిటీ యాక్ట్‌‌‌‌ని యధాతథ స్థితిలో కొనసాగించడానికి ,బీసీలను సోషియో ఎకనామికల్‌‌‌‌గా వర్గీకరిం చడానికి ప్రయత్నించింది. ఆదరాబాదరాగా ఓబీసీ కమిషన్‌‌‌‌కి చట్టబద్దత కల్పించింది.ఇంతకాలం దళిత మైనారిటీ ఓటు బ్యాంక్‌‌‌‌తో గట్టెక్కుతున్న కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి ఆ వర్గాలు దూరమవుతున్నా యి. అయితే, ఆ ఓట్లు సమాజ్‌‌‌‌వాది, బహుజనసమాజ్‌‌‌‌, రాష్ట్రీయ లోక్‌‌‌‌దళ్‌ వంటి ప్రాంతీ య పార్టీలకుమళ్లుతున్నా యి. దీంతో యాదవేతర ఓబీసీ, ఎంబీసీఓట్లపై బీజేపీ కన్నేసింది. ఓబీసీ కమిషన్‌‌‌‌కి రాజ్యాంగహోదా కల్పించి కాంగ్రెస్‌‌‌‌కి , ఇతర నాన్‌‌‌‌–బీజేపీ పార్టీలకు సవాల్‌‌‌‌ విసిరింది. ఈ చర్యవల్ల జాతీయ ఎస్‌‌‌‌సీ,ఎస్‌‌‌‌టీ కమిషన్‌‌‌‌ తరహాలోనే వెనుకబడిన తరగతులకు కూడా సామాజిక భద్రత లభిస్తుంది.

అస్సాం , త్రిపుర రాష్ట్రా ల్లో తిరుగులేని విజయం సాధిం చడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 25 సీట్లపై కన్నేసిం -ది. తూర్పు పాకిస్థాన్‌‌‌‌ విముక్తి పోరాట సమయంలో బంగ్లాని ఆనుకుని ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోకి జనం చొరబడ్డారు. వారిని ఏరివేయడానికి ‘జాతీయపౌర నమోదు (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీ)’ ప్రక్రియని చురుగ్గాసాగించింది. చొరబాటు దారులను అడ్డుకోవడంలోతమకు మాత్రమే చిత్తశుద్ధి ఉందని ఓటర్లకు తెలియజేయాలనుకున్నా రు మోడీ. ఓబీసీలు, దళితులు పెద్దసంఖ్యలోగల ఉత్తరాది హిందీ బెల్ట్‌‌‌‌ రాష్ట్రా లు 2014లోమాదిరిగా తన వెనక లేవని బీజేపీ గుర్తిం చింది.అనేక సర్వేల్ లో కూడా యూపీలో గతంలో వచ్చి నన్నిసీట్లు 2019లో రావని తేలింది. దాంతో తన ఫోకస్‌‌‌‌ని ఈశాన్య రాష్ట్రా లకు మళ్లిం చింది. అందుకే, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీఫైనల్‌‌‌‌ డ్రాఫ్ట్‌‌‌‌ విడుదలైనప్పుడు అమిత్‌‌‌‌ షా నాన్‌‌‌‌–బీజేపీపార్టీలను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిం చారు.జాతీయ ప్రయోజనాలు, అణగారిన వర్గాల అభ్యున్న-తి, బీసీలకు సమన్యాయం వంటి అంశాలను ప్రస్తావించి … నేషనల్‌‌‌‌ సెక్యూ రిటీతో ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీని ముడిపెట్టారు. ఒక కొత్త ప్రచారాన్ని తీసుకున్నారు.ఇవన్నీ ఒక ఎత్తయితే, పార్టీ అధ్యక్షుడు అమిత్‌‌‌‌ షా చేసిన పోల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ మరో ఎత్తు.ఓటర్ల లిస్టు ప్రకారం బూత్‌‌‌‌లవారీగా కమిటీలువేసుకుని, లిస్టులో పేజీకొక ప్రబంధ్‌ (బాధ్యుడు )నినియమించి గెలుస్తూ వచ్చారు. పట్టిం దల్లా బంగారం అన్నట్టుగా 2017 మే వరకు బీజేపీ జైత్రయాత్ర సాగింది. దాంతో , అమిత్‌‌‌‌ షాలో చెప్పలేనంత ధీమావచ్చేసింది. పోయినేడాది జరిగిన నేషనల్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో… ‘మా పార్టీకి సమీప భవిష్యత్తులోఎవరితోనూ భయం లేదు. వచ్చే 50 ఏళ్లూ మాదే అధికారం’ అన్నారు. దేశంలో ప్రాంతీ య పార్టీలహవా సాగుతోందన్న సంగతి మరచిపోయారు.

నీడలా వెన్నంటిన డీమానిటైజేషన్‌‌‌‌, జీఎస్‌‌‌‌టీమోడీ

అమిత్‌‌‌‌ జోడీ ఎన్ని విజయాలు సాధించి నా,నీడలా డీమానిటైజేషన్‌‌‌‌, జీఎస్‌‌‌‌టీ అంటుకు తిరిగాయి.ఈ రెండు నిర్ణయాల ప్రభావం 2018 చివరినాటికితెలిసొచ్చింది. జనరల్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌కి ముం దు జరిగిన సెమీఫైనల్స్‌‌‌‌లో చావుదెబ్బతిన్నది. అయిదు రాష్ట్రా లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణను, చిన్నరాష్ట్రమైన మిజోరాంని మినహాయిస్తే… బీజేపీ పాలిత రాష్ట్రా లైన రాజస్థాన్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లను కాంగ్రెస్‌‌‌‌ దక్కించుకుం ది. ఈ దెబ్బతో బీజేపీలో అంతర్మధనంమొదలైం ది. పార్టీకి సెక్యులర్‌‌‌‌ ముసుగు (ముఖోటా)గా చెప్పుకునే వాజ్‌‌‌‌పేయిని తెరపైకి తెచ్చే ప్రయత్నంచేసిం ది. ఈసారి ‘అజేయ భారత్‌‌‌‌ అటల్‌‌‌‌ బీజేపీ’నినాదం ఎత్తుకుం ది. కానీ, జనంలోకి తీసుకెళ్లడంలోఫెయిలైం ది. 2004లో తీసుకున్న ‘భారత్‌‌‌‌ వెలిగిపోతోంది (ఇండియా షైనింగ్‌‌‌‌)’ స్లో గన్‌‌‌‌లా గే ఇదికూడాబ్యాక్‌‌‌‌ఫైర్‌‌‌‌ అయ్యే ప్రమాదాన్ని ఊహించింది.సరిగ్గా ఆ సమయంలోనే టెర్రరిస్టులు పుల్వామాలోదాడి చేసి, 40కి పైగా పారామిలిటరీ జవాన్లను పొట్టనబెట్టుకున్నా రు. సూసైడ్‌‌‌‌ బాంబర్‌‌‌‌ చేసిన దాడినిబీజేపీ తెలివిగా వాడుకుంది. జనం మరచిపోకుండా వెంటవెంటనే సర్జికల్‌‌‌‌ స్ట్రయిక్స్‌‌‌‌ చేయించి , సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని కల్పించింది. దక్షిణాదికి చెందిన ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పైలట్‌‌‌‌ అభినందన్‌‌‌‌ని పాకిస్థాన్‌‌‌‌ చెర నుంచి బయటకు రప్పించడంలో అంతర్జాతీయంగా వత్తిడి తెచ్చింది. ఇవన్నీ బీజేపీ లాస్ట్‌‌‌‌ లెగ్‌‌‌‌లో ప్రచా-రానికి బాగా ఉపయోగపడ్డాయి. దేశభక్తి, మిలటరీయాక్టివిటీ, బోర్డర్‌‌‌‌ సెక్యూ రిటీ వంటి అంశాల్లో సెన్సిటివ్‌‌‌‌గా ఉండే ఉత్తరాది ప్రజలపై బీజేపీ ప్రచారం బాగాప్రభావం చూపిం చే అవకాశం కనబడుతోంది. పుల్వామాలో దాడి జరగగానే దేశ భద్రతకు పెద్ద ప్రమాదంఏర్పడిందన్న వాతావరణాన్ని సృష్టిం చడంలో బీజేపీశ్రేణులు సక్సెసయ్యాయి. ఇదే టెంపోతో ప్రధాని మోడీతన ప్రచారాన్ని సాగిస్తున్నారు.