
వైభవ్.. వైభవ్.. వైభవ్.. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఇదే పేరు. క్రికెట్ ప్రపంచంలో పిల్లల నుంచి క్రికెట్ లెజెండ్స్ దాకా అందరి నోటా వినిపిస్తున్న పేరు.. వైభవ్ సూర్యవన్షీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ చిచ్చర పిడుగు.. ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్రలోనే తనకంటూ ఒక అధ్యాయం లిఖించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో (35 బాల్స్ లో 100 రన్స్) చెలరేగి అలవోకగా విజయాన్ని అందించాడు.
అతిచిన్న వయసులో ఐపీఎల్ సెంచరీ చేసిన వైభవ్ ప్లేయింగ్ తలచుకుంటే.. ఇప్పుడు అందరికీ గుర్తొస్తున్న పేరు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. సచిన లాగే అతి చిన్న వయసులో వండర్స్ క్రియేట్ చేస్తుండటం చూసి.. మరో సిచన్ అవుతాడేమో అనే చర్చలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా వీరిద్దరికీ ఉన్న సాపేక్ష పోలీకలు ఏంటో ఒకసారి చూద్దాం.
సచిన్ ఇండియాకు క్రికెట్ క్యాపిటల్ గా చెప్పుకునే ముంబైలో పెరిగితే.. వైభవ్ క్రికెట్ కు అంతగా ప్రాతినిధ్యం ఉండని బీహార్ రాష్ట్రంలోని తాజ్ పూర్ లో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. ఇద్దరి మధ్య 1818 కిలోమీటర్ల దూరం ఉండటమే కాకుండా ఇద్దరి పెరిగిన తీరూ, భౌగోళిక పరిస్థితులు అన్నింట్లోనూ చాలా వ్యత్యాసం ఉంది.
సచిన్ లాగే చిన్న వయసులోనే ఆరంగేట్రం:
సచిన్ 1989లో సరిగ్గా 16 ఏండ్ల 205 రోజుల వయసులో పాకిస్తాన్ కరాచిలో ఆరంగేట్రం చేశాడు. అప్పట్లో క్రికెట్ ఆడటమే తక్కువ.. అందులో అంతచిన్న వయసులో బ్యాట్ పట్టుకున్న సచిన్ ను చూసి ప్రపంచమే ఆశ్చర్యానికి గురైంది. ఆరంగేట్రం మ్యాచ్ లో 15 రన్స్ తో నిరాశపరిచినా.. అత్యంత డేంజరస్ పాక్ బౌలర్లను ఎదుర్కొన్న బ్యాటింగ్ టెక్నిక్స్ క్రికెట్ దిగ్గజాలను ఆకట్టుకుంది.
వైభవ్ సూర్యవన్షీ 14 ఏళ్ల వయసులో 2025, ఏప్రిల్ 19 న ఆరంగేట్రం చేశాడు... ఆడుతున్న తన 3వ ఐపీఎల్ మ్యాచ్ లోనే.. ఏప్రిల్ 28న 265.79 స్ట్రైక్ రేట్ తో 35 బాల్స్ లో సెంచరీ చేయడం క్రికెట్ లెజెండ్స్ ను ఆకట్టుకుంది. ఇందులో 7 ఫోర్లు, 11 సిక్సులతో ప్రస్తుత టీ20 క్రికెట్ యుగంలో కొత్త ఒరవడి సృష్టించాడు. సచిన్ అప్పుడున్న వన్డే, టెస్టు ఫార్మాట్లకు తగ్గట్టుగా తయారైతే.. వైభవ్ క్రికెట్ వేగాన్ని పెంచిన టీ20 ఫార్మాట్ ల కోసం సానబెట్టినట్టుగా తయారయ్యాడు.
సచిన్ ముంబైలో రమాకాంత్ ఆచ్రేకర్ కోచింగ్ మెళకువలతో కంగా లీగ్ లలో టెక్నిక్స్ నేర్చుకుంటే.. వైభవ్ మాత్రం అంతగా ప్రాతినిథ్యం లేని బీహార్ నుంచి అంకురించడమే కాకుండా.. ట్యాలెంట్ కు ప్రాంతంతో సంబంధం లేదు అన్నట్లుగా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ తో డైరెక్ట్ సంబంధాలు ఉన్న ముంబై నుంచి సచిన్ వస్తే.. ఐపీఎల్ ద్వారా సూర్వవన్షీ అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు.
కాలాలు వేరైనా.. సేమ్ ట్యాలెంట్:
అతిచిన్న వయసులో క్రికెట్ లో ఆరంగేట్రం చేయడంతో పాటు ట్యాలెంటెడ్ బ్యాట్స్ మెన్ కావడంతో సచిన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డ్స్ ను నమోదు చేశాడు. 24 ఏళ్ల కెరీర్ లో 34,357 రన్స్ సాధించాడు. అదే టైమ్ లో అంతకంటే తక్కువ వయసులో ఎంట్రీ ఇచ్చిన వైభవ్.. తన ట్యాలెంట్ అయితే చూపించుకున్నాడు.. ఇక సచిన్ లాగే లాంగ్ కెరీర్ కొనసాగిస్తాడు అనేందుకు సమయం ముందుంది. వయసుంది.. సమయమూ ఉంది.
ఈ ఇద్దరి ప్లేయర్లను పోల్చడంలో కేవలం ట్యాలెంటే కాకుండా.. వారి వారి కాలమాన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ ఆర్థిక, క్రీడా ప్రపంచంలో అవగాహన కల్పిస్తూ వస్తున్న మార్పులలోకి ప్రవేశిస్తున్న 90వ దశకంలో సచిన్ ఎంటరయితే.. సూర్యవన్షీ ఎలాంటి బెరుకు లేకుండా డేరింగ్, డ్యాషింగ్ బౌండరీలు సాధిస్తున్న టైమ్ లో ఎంటరవుతున్నాడు.
ఇద్దరి భౌగోళిక, కాలమాన పరిస్థితులలో ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ.. ట్యాలెంట్, వయసూ, భవిష్యత్తు దృష్ట్యా సచిన్ కు ఉన్న అవకాశాలు ఉన్నాయనేది విశ్లేషకుల అంచనా. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడున్న పోటీ కూడా చాలా ఎక్కువ. లాంగ్ స్టాండింగ్ కెరీర్ ఉండాలంటే ఫ్రెష్ ట్యాలెంట్ ను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి జిగేల్ మనిపించిన ప్లేయర్లు కొందరు ఉన్నా వారు తర్వాత అదే ఫామ్ ను కొనసాగించలేకపోయారు. మరి వైభవ్ ఫ్యూచర్ లో ఏం చేస్తాడో చూడాలి.
The Record Breaking Hundred from 14 years old Vaibhav Suryavanshi.🥶
— Tanuj (@ImTanujSingh) April 29, 2025
- VAIBHAV, WHAT A SPECIAL TALENT. 🌟pic.twitter.com/R3paz7GJck