75 కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు : ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 75 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని హుజూర్ నగర్  కాంగ్రెస్  అభ్యర్థి ఉత్తమ్  కుమార్  ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంతో పాటు పలు గ్రామాల్లో  ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అనంతరం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని, పేద ఆర్యవైశ్యుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఖమ్మం, నేలకొండపల్లి, -కోదాడ,--హుజూర్ నగర్,-- మిర్యాలగూడకు --ప్యాసింజర్  రైలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అలాగే వ్యాపారులకు ఎగుమతుల కోసం గూడ్స్  రైలు సౌకర్యం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్  నేతలు వ్యాపారులను బెదిరించి దోచుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యాపారులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమ్మేళనంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు మాశెట్టి అనంతరాములు తదితరులు పాల్గొన్నారు .