కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తూ పేదల కష్టాలు తీరుస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడుఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రచారం చివరి రోజు కాగజ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. బట్ పల్లి చౌరస్తా నుం చి మొదలైన ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా వరకు సాగింది. ఆయన మాట్లాడుతూ సిర్పూర్ ప్రాంతంలో సహజ వనరులను అక్రమంగా దోచుకుంటున్న దుష్టపాలన పోవాలంటే బీఎస్పీ గెలవాలన్నారు.
కాగజ్ నగర్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారని ధన్యవాదాలు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, కార్యదర్శి సిడెం గణపతి, జిల్లా అధ్యక్షుడు లెండుగురే శ్యామ్ రావు, నియోజవర్గ ఇన్చార్జ్ దుర్గం మోతీరాం, పట్టణ అధ్యక్షుడు ముస్తఫీజ్, ఇన్చార్జ్ షబ్బీర్, కౌన్సిలర్లు మినాజ్, శ్రీలత, లావణ్య పాల్గొన్నారు.