ఉమ్మడి నల్గండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ప్రజలను చైతన్యవంతం చేయడంలో గ్రంథాలయ ఉద్యమం కీలకపాత్ర పోషించిందని శాసన మండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు, బహుమతుల ప్రధానోత్సవాన్ని సోమవారం నల్గొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై విజేతలకు ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందజేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయాన్ని ఆధునికీకరించడంతో పాటు, సౌలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కల్పించేందుకు సహకరిస్తానన్నారు. అనంతరం స్టూడెంట్లు చేసిన 
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేగట్టె మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండా నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మందడి సైదిరెడ్డి, మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెల్లా మార్కండేయులు పాల్గొన్నారు.

టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరిన కేతేపల్లి జడ్పీటీసీ, ఎంపీటీసీ

నకిరేకల్, వెలుగు : నల్గొండ జిల్లా కేతేపల్లి జడ్పీటీసీ బొప్పని స్వర్ణలత సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేతేపల్లి ఎంపీటీసీ దాచేపల్లి నర్మదా నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలువగా ఆయన పార్టీ కండువా కప్పి టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే చాలా మంది టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారన్నారు. 
కార్యక్రమంలో నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొప్పుల ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మండల అధ్యక్షుడు మారం వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇనుపాముల సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాల వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీమారం సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడుగుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చల్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులయ్యే చేరికలు

కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం శ్రీరంగాపురం, చిలుకూరు మండలం దూతియాతండాకు చెందిన పలువురు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమక్షంలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు బుర్ర సుధారాణి, దేవబత్తిని సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, కాసాను ధనమూర్తి, బండారు గురవయ్య పాల్గొన్నారు.

పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఈడీ దాడులు ఆపాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశ్రమపై ఈడీ దాడులు ఆపాలని పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కర్స్ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముషం రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కూరపాటి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సోమవారం నల్గొండలో జరిగిన ఆ సంఘం మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జీవనోపాధి పొందుతున్న వారిపై దాడులు చేసి కేసులు పెట్టడం అన్యాయం అన్నారు. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సిరిసిల్ల ప్యాకేజీని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అనంతరం 23 మందితో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి

నేరేడుచర్ల, వెలుగు : టీచర్ల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరాటాలు చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి చెప్పారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిన జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని కోరారు.  జిల్లా అధ్యక్షుడు సిరికొండ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాములు, నాగమణి, సోమయ్య, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అరుణ, భారతి, కోశాధికారి వెంకటయ్య పాల్గొన్నారు. 

సీజనల్‌‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలి

సూర్యాపేట, వెలుగు : ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలని సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. సోమవారం ఆడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి ప్రజవాణికి హాజరై ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్చరికలు ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చలి తీవ్రత పెరుగుతున్నందున జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణిలో 32 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత ఆఫీసర్లకు పంపించినట్లు చెప్పారు. డీఏవో రామారావునాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హార్టీకల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీడీ జ్యోతిపద్మ, సీపీవో జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీని నిర్వీర్యం చేసే కుట్ర

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీని నిర్వీర్యం చేసేందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. నల్గొండలోని టీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీవో భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ ఏవోఐ జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సమావేశంలో జోనల్ అధ్యక్షుడు మంజునాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, తుమ్మల వీరారెడ్డి, ఐసీఈయూ జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహాయ కార్యదర్శి తిరుపతయ్య, కొయ్యడ రామయ్య, నలపరాజు సైదులు, ఎస్వీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.

దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుండాలి

యాదాద్రి, వెలుగు : దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని యాదాద్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పమేలా సత్పతి సూచించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన ఆటల పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. భరోసా కల్పించడానికే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని వేడుకలా జరుపుకుంటున్నట్లు చెప్పారు. అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తివారి, వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేవీ కృష్ణవేణి, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో తిరుపతిరెడ్డి, ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూబీని త్వరగా పూర్తి చేయాలి

యాదాద్రి, వెలుగు : ఆలేరులో రైల్వే అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ఆలేరు అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూబీ నిర్మాణంపై యాదాద్రి జిల్లా ఆలేరులో సోమవారం నిర్వహించిన మహాధర్నా, వంటావార్పులో ఆయన మాట్లాడారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూబీ కోసం సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.5.50 కోట్లు విడుదల చేసినా, రాష్ట్ర ప్రభుత్వం కోటా ఫండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయించడంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత విఫలం అయ్యారని ఆరోపించారు. సుదగాని హరిశంకర్, బడుగు జహంగీర్, చిరిగె శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పులిపలుపుల మహేశ్, తోట మల్లయ్య, తునికి దశరథ, సముద్రాల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఈ నెల 27, 28 తేదీల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరుగనున్న టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూటీఏఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా మహాసభలను సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఇన్విటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులను ఆవిష్కరించి మాట్లాడారు. సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్ల బలోపేతం, అందరికీ సమానమైన విద్య అందేందుకు టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృషి చేస్తోందన్నారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్రా సరళ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం, కోశాధికారి శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, జిల్లా కార్యదర్శులు నర్సింహ, అరుణ, వెంకన్న పాల్గొన్నారు.

‘అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించండి’

యాదాద్రి, వెలుగు : ఆలేరు అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని టీపీసీసీ మెంబర్, ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆలేరు - సిద్ధిపేట, పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడెం - కొలనుపాక మధ్య ఉన్న రోడ్డు డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. గొంగిడి సునీత రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వాగులపై బ్రిడ్జిలు నిర్మించలేకపోయారని విమర్శించారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా రూపొందిస్తాం

మిర్యాలగూడ, వెలుగు : ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పకడ్బందీగా రూపొందిస్తున్నామని, ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని మిర్యాలగూడ ఆర్డీవో బి. చెన్నయ్య సూచించారు. ఓటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పొలిటికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీల లీడర్లకు సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1వ తేదీల నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓట్లు, మృతి చెందిన వారి పేర్లను లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి తొలగిస్తామన్నారు. ఓటుకు ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుసంధాన ప్రక్రియ మిర్యాలగూడలో 80 శాతం పూర్తైందన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బత్తుల లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఉదయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైదిరెడ్డి పాల్గొన్నారు.

స్కూళ్ల అభివృద్ధికి కృషి

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేపట్టిన పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అందించనున్నట్లు చెప్పారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెల్లి అర్చనా రవి, కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయత్రి భాస్కర్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భుక్యా స్వప్న పాల్గొన్నారు.

కనీస వేతనం అమలు చేయాలి

యాదాద్రి, వెలుగు : అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలపై పనిభారం తగ్గించడంతో పాటు, కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ భూపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. యాదాద్రి జిల్లా రాయగిరిలో జరుగుతున్న అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్పర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర మహాసభల్లో ఆయన మాట్లాడారు. సర్వేల పేరుతో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సిబ్బందిని మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారన్నారు. ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర​అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మ, జయలక్ష్మి, జిల్లా అధ్యక్ష. ప్రధాన కార్యదర్శులు బూరుగు స్వప్న, రమాకుమారి పాల్గొన్నారు.

‘పోడు’ సమస్యను పరిష్కరించాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : పోడు భూముల సమస్యలను పరిష్కరించి గిరిజన రైతులకు న్యాయం చేయాలని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఎన్నో సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి హక్కులు కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెం, కల్లేపల్లి, శాంతినగర్, వాచ్యతండాలో అర్హులైన వారికి పట్టాదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.

పార్టీ మారాలని ప్రలోభ పెడుతున్రు

నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : పార్టీ మారాలంటూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్లు, కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేయడం సరికాదని టీపీసీసీ కార్య నిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఒక్కరు పోతే 100 మందిని తయారు చేసుకునే సత్తా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉందన్నారు. అధికార పార్టీ లీడర్ల మాటలు ఎవరూ నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెండా ఎగురవేస్తామన్నారు. సమావేశంలో ముద్దం విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బూత్కూరి వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎండీ యూసుప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చనగోని రాజశేఖర్, నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జావీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మధు, మాచర్ల శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

దివ్యాంగులకు పరికరాలు అందిస్తాం

సూర్యాపేట, వెలుగు: దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించేందుకు కృషి చేస్తున్నామని సూర్యాపేట డీఈవో అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. కృత్రిమ పరికరాల గుర్తింపు, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేటలోని జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దివ్యాంగులకు టెస్టులు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 382 మంది చిన్నారులకు టెస్టులు చేసి, వారికి ఎలాంటి పరికరాలు అవసరమో గుర్తించామన్నారు. అనంతరం దివ్యాంగ చిన్నారులకు బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందజేశారు. క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా సమన్వయకర్తలు యర్రంశెట్టి రాంబాబు, శ్రావణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం గోలి పద్మ, డాక్టర్లు శ్వేత పద్మ బెహరా, రవికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పత్తి రైతుకు ఊరట

అకాల వర్షాలతో దిగుబడి తగ్గినా కలిసొచ్చిన రేటు

ఎకరాకు 8 నుంచి 6క్వింటాళ్లకు పడిపోయిన దిగుబడి

రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతున్న క్వింటాల్ పత్తి

ఇంకా ధర పెరిగే అవకాశం ఉండడంతో పత్తిని నిల్వ చేస్తున్న రైతులు

అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు ధర రూపంలో కాస్త ఊరట లభిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులకు ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనుకున్నంత దిగుబడి రాకపోయినప్పటికీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పత్తికి మంచి రేటు పలుకుతుండడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధర రాబోయే రోజుల్లో మరింత పెరిగే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండొచ్చని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.

గతేడాది కూడా పత్తి ఏరడం చివరి దశకు చేరుకున్న టైంలో రేటు పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి రైతులు జాగ్రత్త పడుతున్నారు. ఒకే సారి ఏరకుండా, చెట్లపైనే పత్తి వాడిపోకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అక్కడకక్కడ వర్షాలు వస్తాయనుకుంటున్న ప్రాంతాల్లో మాత్రం పత్తి నిల్వ చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గత నెల నుంచి పత్తి మార్కెట్లోకి రావడం ప్రారంభమైంది. అయితే నవంబర్, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పత్తి ఎక్కువగా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉండడంతో మంచిరేటు వస్తదనే ఆలోచనలో రైతులు ఉన్నారు. దళారులు రంగ ప్రవేశం చేసినప్పటికీ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలకు పత్తి తరలించేందుకు కూడా రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 9.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 6.45 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, సూర్యాపేటలో 2.25 లక్షలు, యాదాద్రి జిల్లాలో 75 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో వర్షాలు పడక కొంత నష్టం జరిగితే.. పత్తి గింజలు నాటి, మొలకెత్తిన టైంలో భారీ వర్షాలు పడ్డాయి.

దీంతో చాలా చోట్ల పత్తి ఎర్రబారింది. దీంతో ప్రస్తుతం ఎకరాకు ఆరేడు క్వింటాళ్లకు మించి రావడం లేదని ఆఫీసర్లు చెపుతున్నారు. ఆయకట్టు ఏరియాలో కొన్ని చోట్ల మాత్రం 8, 9 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వస్తోంది. నల్గొండ జిల్లాలోనే పత్తికి భారీ నష్టం వాటిల్లింది. 6.45 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయగా, సుమారు 50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ మార్కెట్లోకి వస్తున్న పంటను పరిశీలిస్తే మొత్తం దిగుబడి 25 లక్షల నుంచి 30 లక్షల క్వింటాళ్లకు మించకపోవచ్చని చెపుతున్నారు. 

మార్కెట్లోకి వచ్చింది 1.50 లక్షల క్వింటాళ్లే...

మొదటి దశలో వచ్చిన పత్తి కంటే నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వచ్చే పత్తికే ఎక్కువ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పికింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పత్తి నాణ్యత ఉండకపోవడంతో అంత రేటు పలకదని, కానీ ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న పత్తికి మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని అంటున్నారు. ప్రస్తుతం క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పత్తి రూ.8 వేల నుంచి రూ.10 వేలు పలుకుతోంది.

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి నాటికి ఈ రేట్​ మరింత పెరిగే అవకాశాలు ఉండొచ్చని కూడా చెబుతుండడంతో రైతులు పత్తిని నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో మార్కెట్లోకి వచ్చిన పత్తి కేవలం 1.50 లక్షల క్వింటాళ్లు మాత్రమే. గతేడాది మార్కెట్లోకి పత్తి అంతా తరలించాక, రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమాంతం పెంచారు. దీంతో రైతులు నష్టపోయారు. కానీ ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలోనే రేటు పలుకుతుండటంతో రైతులు జాగ్రత్త పడుతున్నారు.

తెరచుకోని సీసీఐ సెంటర్లు

కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర కంటే మార్కెట్లో పత్తికి రేటు ఎక్కువగా ఉండటంతో సీసీఐ సెంటర్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. మద్దతు ధర రూ. 6,100 నుంచి రూ.6,380 వరకు ఉంది. మద్ధతు ధరకు మించి 2, 3 వేలు ఎక్కువగా వస్తుండడంతో సెంటర్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏడీ శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. రైతులు దళారుల బారిన పడి నష్టపోవద్దని మార్కెట్లో మంచి రేటు పలుకుతోందన్నారు.