
పెద్దపల్లి: కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. రామగుండం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం (మార్చి 7) ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ.. గత పది ఏండ్లుగా రామగుండం ప్రాంతం వెనకబడిందని.. ఇక్కడి రైల్వే మార్గాలను ఎవరు కూడా పట్టించుకోలేదని అన్నారు.
ALSO READ | కూనారం రైల్వే బ్రిడ్జి త్వరగా కంప్లీట్ అయ్యేందుకు కృషి చేస్తా: ఎంపీ వంశీ
తాను పెద్దపెల్లి ఎంపీ అయ్యాక.. మొదటి ప్రయత్నంలోనే బొగ్గు గనుల గురించి పార్లమెంట్ లో మాట్లాడానని గుర్తు చేశారు. రెండవ సారి రైల్వే మార్గాల ఇబ్బందులు గురించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించానని పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి కాజీపేట్ టూ బలర్శా ఎక్స్‌ప్రెస్ రైల్‌ను పునః ప్రారంభించామని చెప్పారు.
మన ప్రాంతంలో 1974లో జరిగిన రైల్వే రిక్రూట్మెంట్ తప్ప ఇప్పటివరకు రైల్వే ఉద్యోగాల భర్తీ జరగలేదని.. ఈ మేరకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. స్థానికుల కోరిక మేరకు రామగుండంలో స్వర్ణ జయంతి గరీబ్ రాద్, మిలీనియం, నవజీవన్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ల హల్టింగ్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.