వైరల్: లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుని హాట్ కామెంట్స్.. '9 to 5' పనివేళలు అంతరించిపోతాయా..!

వైరల్: లింక్డ్‌ఇన్ సహ వ్యవస్థాపకుని హాట్ కామెంట్స్.. '9 to 5' పనివేళలు అంతరించిపోతాయా..!

సాధారణంగా మన దేశంలో ఉద్యోగానికి వెళ్లడం అంటే ఉదయం 9 గంటలకు ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి రావడమే. మారుతున్న కాలాన్ని బట్టి వివిధ రంగాల పనివేళల్లో మార్పులు వచ్చినా కానీ ఇప్పటికీ మెజారిటీ సంస్థలు 9 to 5 సమయాన్నే పాటిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో ఇది పూర్తిగా మారనుందని  ప్రముఖ ఎంప్లాయ్‌మెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ సహ-వ్యవస్థాపకులు రీడ్ హాఫ్‌మన్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. 

రీడ్ హాఫ్‌మన్‌ 9-  to 5 ఉద్యోగాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల్లో సంప్రదాయ పనివేళలు కనుమరుగు కానున్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.  నీల్ తపారియా అనే ఇండో అమెరికన్.. హాఫ్‌మన్ ఇంటర్వ్యూ క్లిప్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఆ క్లిప్ లో 'మీ 9 to - 5 ఉద్యోగం త్వరలో కనిపించదు. 2034 నాటికి అంతరించిపోతుంది. ఇది రీడ్ హాఫ్‌మన్ తాజా అంచనా. 1997లో సోషల్ మీడియా ఎదుగుదలను అంచనా వేసిన లింక్డ్‌ఇన్ స్థాపకులు ఈ విధంగా పేర్కొన్నారు' అని తెలిపారు.

 

సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు ప్రపంచాన్ని మారుస్తాయని రీడ్ హాఫ్‌మన్ గతంలో అంచనా వేశారు. వెకేషన్ రెంటల్ దిగ్గజం Airbnbలో ప్రారంభ పెట్టుబడిదారులు కాగా షేరింగ్ ఎకానమీ పెరుగుదలను ముందే ఊహించారు. చాట్‌జీపీటీ ప్రారంభానికి ఏళ్లకు ముందే కృత్రిమ మేధస్సు (AI) విప్లవాన్ని కూడా గ్రహించారు. ఆయన గత మూడు అంచనాలు నిజమయ్యాయని తపారియా తెలిపారు. ఈసారి అంచనా కూడా తప్పదని భావిస్తున్నానని పేర్కొన్నారు.