![విలియమ్సన్ సెంచరీ..ట్రై నేషన్స్ సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్](https://static.v6velugu.com/uploads/2025/02/new-zealand-in-tri-nations-odi-series-final_uT00XhL51v.jpg)
లాహోర్ : పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ట్రై నేషన్స్ వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి ఫైనల్ చేరింది. వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (133 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 304/6 స్కోరు చేసింది. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే (150) భారీ సెంచరీతో చెలరేగాడు.
అరంగేట్రం వన్డేలోనే 150 స్కోరు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. వియాన్ ముల్డర్ (64), జేసన్ స్మిత్ (41) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విల్ ఒరూర్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం విలియమ్సన్ సెంచరీకి తోడు ఓపెనర్ డెవాన్ కాన్వే (97) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 308/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
కేన్ విలియమ్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. బుధవారం పాకిస్తాన్–సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచే జట్టు 14న కివీస్‌తో టైటిల్ ఫైట్‌లో తలపడుతుంది.