Wimbledon 2024: వింబుల్డన్ విజేత బార్బోరా క్రెజికోవా

Wimbledon 2024: వింబుల్డన్ విజేత బార్బోరా క్రెజికోవా

వింబుల్డన్‌ మ‌హిళ‌ల సింగిల్స్‌ విజేతగా చెక్ టెన్నిస్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా అవ‌త‌రించింది. శ‌నివారం(జులై 13) జ‌రిగిన ఉత్కంఠ పోరులో ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలినిని ఓడించి చెకియా స్టార్ తొలి వింబుల్డన్ టైటిల్‌ కైవసం చేసుకుంది. ట్రోఫీతో పాటు బార్బొరా రూ.28.5 కోట్ల ప్రైజ్‌మ‌నీ సొంతం చేసుకుంది.

సెమీఫైన‌ల్లో టాప్ సీడ్ ఎలెనా రిబాకినాను మట్టి కురిపించిన క్రెజికోవా.. ఫైన‌ల్లోనూ అదే దూకుడు క‌న‌బ‌రిచింది. తొలి సెట్‌ను 6-2తో చేజిక్కించుకొని మ్యాచ్‌పై పట్టు సాధిచింది. అయితే, రెండో సెట్‌ను పావోలిని గెలిచి సమం చేసింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇద్దరూ హోరీహోరీగా తలపడ్డారు. చివరకు ఒత్తిడిని జ‌యించిన చెక్ స్టార్ పైచేయి సాధించింది. 6-2,2-6, 6-4తో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ఇది క్రెజికోవా కెరీర్‌లో తొలి వింబుల్డన్ టైటిల్ కాగా,  రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2021లో బ‌ర్బొరా ఫ్రెంచ్ ఓపెన్ విజేత‌గా అవ‌త‌రించింది.

ALSO READ | IND vs ZIM: కుమ్మేసిన యంగ్ గన్స్.. టీ20 సిరీస్ భారత్ వశం