వింబుల్డన్‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌ బోణీ .. మెద్వెదెవ్‌‌‌‌, దిమిత్రోవ్‌‌‌‌ కూడా..

వింబుల్డన్‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌ బోణీ ..  మెద్వెదెవ్‌‌‌‌, దిమిత్రోవ్‌‌‌‌ కూడా..

వింబుల్డన్‌‌‌‌: డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ కార్లోస్‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌).. వింబుల్డన్‌‌‌‌లో బోణీ చేశాడు. సోమవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో మూడోసీడ్ అల్కరాజ్‌‌‌‌ 7–6 (7/3), 7–5, 6–2తో మార్క్‌‌‌‌ లాజల్‌‌‌‌ (ఈస్టోనియా)పై నెగ్గాడు. 2 గంటలా 23 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌కు మార్క్‌‌‌‌ గట్టి పోటీ ఇచ్చాడు. తొలి సెట్‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కొట్టిన ప్రతి షాట్‌‌‌‌ను ఈజీగా రిటర్న్‌‌‌‌ చేశాడు. అయితే కెరీర్‌‌‌‌లో తొలి గ్రాండ్‌‌‌‌ స్లామ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కావడంతో కీలక టైమ్‌‌‌‌లో పాయింట్లు రాబట్టలేకపోయాడు. మూడో సెట్‌‌‌‌లో 1–5తో వెనకబడిన దశలోనూ మార్క్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను కాచుకుని సెట్‌‌‌‌లో నిలిచాడు. కానీ బేస్‌‌‌‌ లైన్‌‌‌‌ పాయింట్లతో అల్కరాజ్‌‌‌‌ సెట్‌‌‌‌, మ్యాచ్​ నెగ్గాడు. 

ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో మెద్వెదెవ్‌‌‌‌ (రష్యా) 6–3, 6–4, 6–2తో కొవాసెవిచ్‌‌‌‌ (అమెరికా)పై, దిమిత్రోవ్‌‌‌‌ (బల్గేరియా) 6–3, 6–4, 7–5తో లాజోవిచ్‌‌‌‌ (సెర్బియా)పై, కాస్పర్‌‌‌‌ రుడ్‌‌‌‌ (నార్వే) 7–6 (7/2), 6–4, 6–4తో బోల్ట్‌‌‌‌ (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌లోకి అడుగుపెట్టారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో పౌలోని (ఇటలీ) 7–5, 6–3తో సోరిబెస్‌‌‌‌ టోర్మో (సెర్బియా)పై, సకారి (జర్మనీ) 6–3, 6–1తో కెస్టెర్‌‌‌‌ (అమెరికా)పై, మాడిసన్‌‌‌‌ కీస్‌‌‌‌ (అమెరికా) 6–4, 7–6 (7/4)తో ట్రెవిసాన్‌‌‌‌ (ఇటలీ)పై, ఒసాకా (జపాన్‌‌‌‌) 6–1, 1–6, 6–4తో ప్యారీ (ఫ్రాన్స్‌‌‌‌)పై నెగ్గగా, ఎనిమిదో సీడ్‌‌‌‌ జెంగ్‌‌‌‌ (చైనా) 6-–4, 2–-6, 4–6 --తో సున్‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌) షాకిచ్చింది. అంతకుముందు అరీనా సబలెంక,  విక్టోరియా అజరెంకా.. భుజం గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు.