భద్రాద్రిలో గాలివాన బీభత్సం

భద్రాద్రిలో గాలివాన బీభత్సం

భద్రాచలం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు విద్యుత్​ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీనితో పట్టణంలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

బీసీ హాస్టల్ వద్ద ప్రహరీపై చెట్టు పడి కూలిపోయింది. అధికారులు చెట్లను తొలగించారు. ఆంధ్రా, -తెలంగాణ సరిహద్దుల్లో విద్యుత్​ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు పడిపోయాయి.