న్యూఢిల్లీ: దేశంలో ఉత్పత్తి అవుతున్న క్రూడాయిల్‌పై వేసే విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ.2,100 కి ప్రభుత్వం తగ్గించింది. గతంలో టన్నుకి రూ.4,600 పడేది. ఈ ట్యాక్స్‌ను స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) రూపంలో వేస్తున్నారు. డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయల్ లేదా ఏటీఎఫ్‌ల ఎగుమతులపై వేస్తున్న ఎస్‌ఏఈడీని జీరో దగ్గర ప్రభుత్వం కొనసాగించింది.
మారిన రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇండియా మొదటిసారిగా 2022, జులై 1 న ఆయిల్ కంపెనీలకు వచ్చే భారీ ప్రాఫిట్స్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించింది. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకొకసారి ట్యాక్స్ రేట్లను మారుస్తోంది. అంతకుముందు రెండు వారాల్లోని ఆయిల్ ధరలను పరిశీలించి ఈ సవరణలు చేస్తోంది.