న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ. 2,100 నుంచి రూ. 1,850కి తగ్గించినట్టు కేంద్రం ప్రకటించింది.ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) రూపంలో విధిస్తారు. డీజిల్, పెట్రోల్ జెట్ ఇంధనం పన్ను వసూలు చేయడం లేదని కేంద్రం తెలిపింది.
కొత్త రేట్లు ఆగస్టు 31, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. భారతదేశం మొదటిసారిగా జులై 1, 2022న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను విధించింది. గత రెండు వారాల సగటు చమురు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి పన్ను రేట్లను సమీక్షిస్తారు.