న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీస్‌లకు అంతరాయం ఏర్పడడంతో ఇండియాలోని ఐదు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ) ఇబ్బంది పడ్డాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) ప్రకటించింది. కానీ, సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపింది. కొత్త అప్‌డేట్ కారణంగా గ్లోబల్‌గా మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వీస్‌లు శుక్రవారం ఆగిపోయిన విషయం తెలిసిందే.
దీంతో గ్లోబల్‌గా చాలా విమాన సర్వీస్‌లు, బ్యాంక్ సర్వీస్‌లు మీడియా సర్వీస్‌లకు అంతరాయం ఏర్పడింది. లక్షల కొద్దీ డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు పనిచేయలేదు. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు, వీటి రిజిస్టర్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్స్ (ఆర్‌టీఏ) ల కార్యకలాపాలపై పెద్దగా ప్రభావం పడలేదని యాంఫీ పేర్కొంది. మొత్తం 44 ఏఎంసీలు ఉంటే కేవలం ఐదు కంపెనీలకు చెందిన కొన్ని కీలకమైన పనులకు అంతరాయం ఏర్పడిందని తె,కలిపింది.