రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపుల నిర్మూలకు ప్రయత్నిస్తామని ప్రకటించినా.. వాటి నిర్వాహకులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. వైన్స్ షాపుల ఓనర్లతో మద్యం అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటున్నారు. జగిత్యా జిల్లా కోరుట్ల మల్లాపూర్ మండలంలోని 4 వైన్స్ షాపుల నిర్వాహకులతో బెల్ట్ షాపు నిర్వాహకులు అగ్రిమెంట్ చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఏ వైన్స్ నుంచి ఏ గ్రామాల బెల్ట్ షాపు ఓనర్లు మద్యం కొనుగోలు చేయాలో ఒప్పందం రాసుకున్నారు. అయితే ఇదంతా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసే జరుగుతోందని అంటున్నారు స్థానికులు. మల్లాపూర్ రేగుంటలోని రంజిత్ వైన్స్ తప్ప మిగతావన్నీ ఒకే వ్యక్తి కంట్రోల్ లో ఉన్న సిండికేట్ వైన్స్ కావడం విశేషం.