తెలంగాణలో వైన్ షాపులు బంద్..

తెలంగాణలో వైన్ షాపులు బంద్..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైన్స్, బార్ షాప్స్ క్లోజ్ అయ్యాయి. 2023, నవంబర్ 30 న పోలింగ్ జరుగనుండడంతో  మంగళవారం(నవంబర్28) సాయంత్రం 5గంటలకు వైన్ షాప్స్ క్లోజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో  ఈ రోజు సాయంత్రం 5 గంటలకు  హైదరాబాద్ తోపాటు మిగతా జిల్లాల్లోని అన్ని వైన్స్ షాపులు బంద్ చేశారు. 

5 గంటలకు అన్ని వైన్ షాప్స్ కు వెళ్లి మిగిలిన స్టాక్ ని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన స్టాక్ ని అమ్మడానికి వీల్లేందని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. స్టాక్ ని క్లియర్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధర కన్నా తక్కువకు అమ్మితే నాలుగు లక్షల రూపాయలు జరిమానా విధిస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం బంద్ చేసిన వైన్స్ షాపులను తిరిగి 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ తెరుచుకోనున్నాయి. మరోవైపు , ఈనెల 30 తో  వైన్ షాప్ ప్రస్తుత ఎక్సైజ్ పాలసీ ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి టెండర్ లో వైన్ షాప్స్ దక్కించుకున్న కొత్త వైన్ షాప్స్ ఓపెన్ కానున్నాయి.

Also Read :- తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి 144 సెక్షన్ : ఎన్నికల కోడ్ ఎవరు ఉల్లంగించినా చర్యలు