అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్

అలర్ట్..  హైదరాబాద్లో మరో  12 గంటలు వైన్ షాపులు బంద్

మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. హైదరాబాద్ లో మరో  12 గంటలు వైన్ షాపులు బంద్ కానున్నాయి ఈ విషయాన్ని సీపీ  కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.  పార్లమెంట్  ఎన్నికల నేపథ్యంలో మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి.   పోలింగ్ జరిగే మే 13వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.  

పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి ఓపెన్ అవుతాయి.  అయితే హైదరాబాద్ లో మాత్రం  మరో 12 గంటలు లిక్కర్ షాపులు, బార్లు, హోటల్స్, క్లబ్స్,అన్ని రకాల లిక్కర్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.  తిరిగి మే 14 తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ అవుతాయి.  

మరోవైపు  ఎన్నికల ఫలితాల రోజు వచ్చే నెల జూన్ 4వ తేదీన కూడా వైన్ షాపులు బంద్ కానున్నాయి.   ఈసీ ఆదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.