హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..

హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..


హైదరాబాద్: మందు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. మహంకాళీ బోనాల పండుగ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని  వైన్స్ షాపులు మూసివేయబడతాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎల్లుండి జూలై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు వైన్స్ షాపులన్నీ మూసివేయబడతాయి. 

సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట , బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటలనుంచి 24 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చైటినాక, షాలి బండ , మీర్‌చౌక్ ప్రాంతాల్లో జూలై 28 ఉదయం 6 గంటలనుంచి రెండు రోజుల పాటు కల్లు, వైన్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లను , క్లబ్బులు , మద్యం విక్రయించే లేదా అందించే ఇతర సంస్థలు మూసివేయబడతాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.