శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 30 వ తేదీన గురువారం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్ లు ,పబ్ లు ఇన్ క్లూడింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బార్ రూమ్స్ మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31 వ తేదీ ఉదయం 6 గంటల వరకు దుకాణాలు మూసి వేయనున్నారు.
శాంతి భద్రతల కారణంగా మద్యం షాపులను పండుగ సందర్భంగా మూసివేయాలని మద్యం షాపులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.