అసలే ఆదివారం ( ఏప్రిల్ 6 ).. వైన్స్ బంద్.. హైదరాబాదీలు ముందే కొనుక్కోండి..

అసలే ఆదివారం ( ఏప్రిల్ 6 ).. వైన్స్ బంద్.. హైదరాబాదీలు ముందే కొనుక్కోండి..

ఆదివారం వచ్చిందంటే హైదరాబాదీలకు ముందు గుర్తొచ్చేది చుక్క, ముక్క.. ప్రపంచమంతా ఎటుపోయినా సరే.. ఆదివారం అంటే దావత్ ఉండాల్సిందే అనే బాపతు చాలామంది ఉంటారు. అలాంటిది... ఆదివారం వైన్ షాపులు మూసేస్తే పరిస్థితి ఏంటో ఉహాయించుకోండి.. అవును ఈ ఆదివారం ( ఏప్రిల్ 6 ) హైదరాబాద్ లో వైన్స్ మూతపడనున్నాయి. రేపు శ్రీరామనవమి సందర్భంగా సిటీలో శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ శోభాయాత్రలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.

శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ( ఏప్రిల్ 6 ) ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వైన్ షాపులు, బార్లు  మూసివేయాలని రాచకొండ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది కమిషనరేట్. సిటీలో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.

మరి.. ఆదివారం పూట చుక్క లేకపోతే ఎలా అని ఫీల్ అవుతున్న మందుబాబులు చింతించడం మానేసి ఈరోజే వైన్ షాపుకు వెళ్లి రేపటికి సరుకు తెచ్చిపెట్టుకుంటే బెటర్. లేదు రేపు మా తిప్పలేవో మేము పడతాం.. డబుల్ రేట్ అయినాసరే బ్లాక్ లో మందు కొంటాం అంటే ఇక మీ ఇష్టం.