- గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ విజ్ఞప్తి
- ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వినతి
ముషీరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేసింది. కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ నేతృతంలోని బృందం శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం బాలరాజ్‌గౌడ్ మాట్లాడుతూ.. సమగ్ర సర్వే నిర్వహిస్తున్నందుకు రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్‌జోడో యాత్రలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గౌడ్ లకు జనాభా ప్రతిపాదికన అన్ని రంగాల్లో సమాన వాట ఇస్తామని చెప్పారన్నారు. స్థానిక సంస్థల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు అమలుచేయాలని కోరారు. గౌడ కులస్తులకు వైన్స్, బార్లు కేటాయింపులో 25% రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టి, ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఆయిలి వెంకన్నగౌడ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.