తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్

 తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. 

ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు.   తిరిగి మంగళవారం ఉదయం మద్యం షాపులు తెరుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.  దీంతో  మద్యం ప్రియులు ముందుగానే స్టాక్ తెచ్చిపెట్టుకోవాలని ప్లాన్ లో ఉన్నారు. 

మరోవైపు వేసవికాలంలో  బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు అసంతృప్తి చెందుతున్నారు.  ఎండలు పెరగడం, ఐపీఎల్, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీర్లకు డిమాండ్  పెరిగింది. డిమాండ్​కు తగిన సప్లై లేకపోవడంతో చాలా చోట్ల వైన్  షాపులలో నో స్టాక్​ బోర్డులు పెడుతున్నారు.  ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మద్యంప్రియులు కోరుతున్నారు. అయితే ఇదే అదనుగా చేసుకుని కొందరు  కొన్ని చోట్ల అధిక ధరలకు అమ్ముతున్నారని వాపోతున్నారు.