జులై 28న వైన్స్​ బంద్

హైదరాబాద్, వెలుగు : పాతబస్తీలోని లాల్​దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. సౌత్ జోన్, ఈస్ట్ జోన్ డివిజన్లలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వైన్స్​బంద్​ఉంటాయని సీపీ శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. పాతబస్తీలో మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించారు.