పొరుగు రాష్ట్రం ఏపీలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎటు చూసినా కోడి పందేల బరులే. ఏ గల్లీకెళ్లిన పందెం కోళ్లు, పందెం రాయుళ్లే దర్శనమిస్తున్నారు. వీటి ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. అదృష్టం తలుపుతట్టినోళ్లు నిమిషాల వ్యవధిలో లక్షలు సంపాదిస్తుంటే.. లక్ష్మి కటాక్షం పొందని వారు తెచ్చినదంతా పోగొట్టుకొని నిరాశతో ఇంటికెళ్తున్నారు.
ఇదిలావుంటే, కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో కోడి పందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. విజేతలకు రూ.25లక్షల విలువైన మహీంద్రా థార్ కారు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు. బహుమతిగా ఇవ్వనున్న మహీంద్రా థార్ కారును బరి వద్దనే డిస్ ప్లేగా ఉంచారు.
ఏపీలో పెద్ద ఎత్తున కోడి పందేలు.. కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురులో కోడి పందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్.. గెలిచినోళ్లకు రూ. 20 లక్షల థార్ కారు బహుమతి..#KodiPandhalu #Kakinada #AndhraPradesh pic.twitter.com/hc926NKPEY
— తెనాలి రామకృష్ణుడు (@vikatakavi369) January 13, 2025
ఎప్పటిలానే కోడి పందేలకు ఈ ఏడు అనూహ్య స్పందన వస్తోందని నిర్వాహకులు చెప్తున్నారు. కరప మండలం పెనుగుదురులో ఏర్పాటు చేసిన ఈ ఒక్క బరిలోనే దాదాపు రూ.5 కోట్ల మేర పందేలు జరుగుతాయని అంచనా.
ALSO READ | సంక్రాంతి స్పెషల్: 130 వంటకాలతో ఆంధ్ర అల్లుడిని అవాక్ చేసిన తెలంగాణ అత్త