Film Fare Awards 2023: ఆర్ఆర్ఆర్‌కు 7 అవార్డులు..వివిధ కేటగిరీల్లో తెలుగు విజేతల లిస్ట్ ఇదే!

తాజాగా, 2023 సంవత్సరానికి గానూ 68వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను (68th Film Fare Awards South 2023)ప్రకటించారు.సౌత్ ఇండస్ట్రీలో నాలుగు భాషల్లో థియేటర్లలోరిలీజైన సినిమాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులు అనౌన్స్ చేశారు.

Also Read:ప్రముఖ యాంకర్-నటి కన్నుమూత..మెట్రోలో వినిపించే అనౌన్స్‌మెంట్‌ వాయిస్ తనదే

తెలుగులో ఉత్తమ చిత్రంగా దర్శక ధీరుడి ఆర్ఆర్ఆర్ సినిమా ఎంపికైంది.ఈ సినిమాకు ఏకంగా ఏడు అవార్డులు దక్కాయి. దీంతోపాటు తెలుగు క్లాసిక్ హిట్ సీతారామం సినిమాకు 5 అవార్డులు,నక్సల్ నేపథ్యంలో వచ్చిన రానా విరాటపర్వం సినిమాకు రెండు అవార్డ్స్ వచ్చాయి.మరి అవార్డులు ఏ ఏ విభాగంలో కైవసం చేసుకున్నాయో చూద్దాం. 

వివిధ కేటగిరీల్లో తెలుగు ఫిల్మ్‌ఫేర్‌-2023 విన్నర్స్:

ఉత్తమ చిత్రం –ఆర్ఆర్ఆర్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌)-సీతారామం (డైరెక్టర్ హను రాఘవపూడి)

ఉత్తమ నటుడు –రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌)-దుల్కర్‌ సల్మాన్‌

ఉత్తమ నటి -మృణాళ్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌)-సాయి పల్లవి( విరాట్‌ పర్వం)

ఉత్తమ సహాయ నటుడు -రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్‌)
ఉత్తమ సహాయ నటి-నందితాదాస్‌ (విరాట్‌ పర్వం)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ -ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ లిరిక్స్-సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)(కానున్న కల్యాణం,సీతారామం)

ఉత్తమ నేపథ్య గాయకుడు-కాలభైరవ (కొమురం భీముడో..ఆర్‌ఆర్ఆర్‌)
ఉత్తమ నేపథ్య గాయని-చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)

ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్‌ రక్షిత్‌ (నాటు నాటు..ఆర్‌ఆర్ఆర్‌)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ -సాబు శిరిల్‌ (ఆర్ఆర్‌ఆర్‌).