హైదరాబాద్, వెలుగు: వరద బాధితుల సహాయార్థం విన్స్బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 51 లక్షల విరాళం అందజేసింది. సంస్థ ఎండీ ఎస్. నారాయణ దాస్ డాగ, సీఈవో సిద్దార్థ డాగ.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందజేశారు.
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులు వి.సురేందర్, ఎస్.ఎన్ రెడ్డి లు కూడా ఒక కోటి లక్షా డెబ్బై ఐదు వేల రూపాయల చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు.