చలికాలంలో పిల్లలకు ఎలర్జీలు ఎక్కువగా వస్తుంటాయి.అందుకే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాటి నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. శీతాకాలంలో పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తెలుసుకుందాం. . .
చలికాలంలో పసిపిల్లలకు సాధ్యమైనంత వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. పిల్లలకు డెయిరీ పాలు పట్టడం వల్ల ఆ పాలలో ఉన్న ఎలర్జీ పిల్లలకు కూడా సోకుతుంది. పిల్లలకు సీజనల్ గా రక రకాల ఎలర్జీలు సోకుతుంటాయి.
Also Read :- లెమన్ టీ తక్కువగా తాగితే ఆరోగ్యం.. ఎక్కవైతే ఎసిడిటీ వస్తోంది.. జాగ్రత్త..!
ఇలాంటప్పుడు పిల్లలకు ఎలాంటి ఎలర్జీ సోకిందే తెలుసుకునేందుకు అంతకుముందు మెడికల్ రికార్డులను దాచిపెట్టుకోవాలి. చలికాలంలో పిల్లలను దుమ్ము, ధూళికి వీలైనంత దూరంగా ఉంచాలి. మట్టిలో ఆటలు ఆడకుండా చూసుకోవాలి.. అలాగే పిల్లలకు పౌడర్లు, పర్ ఫ్యూమ్, రూమ్ ఫ్రెష్ నర్స్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
చలికాలంలో పిల్లల చర్మం పొడిబారకుండా క్రీమ్ రాయాలి. పిల్లలను చలిగాలికి బయటకు తీసుకెళ్ల కూడదు. ఒకవేళ తీసుకెళ్లాల్సి వస్తే తలకు, చెవులకు చలిగాలి సోకకుండా స్వెట్టర్లు, మంకీ క్యాప్ లాంటివి వాడాలి.
–వెలుగు, లైఫ్–