చలిలో బయట అడుగుపెట్టాలంటేనే ఒకటి, రెండుసార్లు ఆలోచిస్తాం. మరి ఎక్సర్ సైజ్ చేయాలంటే కాస్త ఇబ్బంది... వణికించే చలిలో రన్నింగ్, జాకింగ్ చేయాలంటే చాలామంది భయపడుతుంటారు. కాస్త కొత్తగా ప్రయత్నిస్తే చలిలోనూ ఎంచక్కా ఎక్సర్ సైజ్ లు చేయవచ్చని అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. కొంతమంది సింగిల్ వ్యాయామాలు చేస్తుంటారు. అలా కాకుండా గ్రూపుతో జతకడితే సులభంగా చేయొచ్చు. బృందంగా వ్యాయామాలు చేస్తే కొత్త ఉత్సాహం వస్తుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి అలపడుతుంది. ఇంటి దగ్గర వ్యాయామం చేయడానికి బద్ధకంగా ఉంటే, స్మార్ట్ ఫోన్ యాప్స్ ఉపయోగించుకోవాలి. వీటి సాయంతో చురుగ్గా ఇంటి దగ్గర్నే వర్కవుట్స్ చేసుకోవచ్చు. వీటితోపాటు చేతులకు గ్లోవ్స్, తలకు బ్యాండ్స్ ధరించాలి. ఇది వెచ్చదనాన్ని అందిస్తాయి. బాడీకి తగ్గట్టుగా వ్యాయామాలను ఎంచుకోవాలి.. ఇతరకాలాల్లో కన్నా చలికాలంలో చేసే వర్కవుట్స్ ఎక్కువ ఫలితాన్నిస్తాయట. సో దుప్పట్లో దూరకుండా చలికాలంలోనూ ఎక్సర్ సైజ్ లు చేయండి మరి.
–వెలుగు, లైఫ్–