Good Health : చలికాలంలో ఈ ఫుడ్ తినండి..  వెచ్చగా.. తేలికగా.. ఆరోగ్యంగా ఉండండీ..

Good Health : చలికాలంలో ఈ ఫుడ్ తినండి..  వెచ్చగా.. తేలికగా.. ఆరోగ్యంగా ఉండండీ..

చూస్తుండగానే చలికాలం వచ్చేసింది. కాలంతో పాటే శరీరంలోనూ మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా చలికాలం వస్తే బరువు పెరుగుతారు అన్న అనుమానం ఉంటుంది  చాలామందికి. ఇదే విషయం డాక్టర్లను అడిగితే సైంటిఫిక్​గా అలాంటిదేదీ లేకపోయినా కొన్ని అలవాట్ల వల్ల పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంతకీ చలికాలంలో బరువు పెరుగుతారా? అలా పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

చలికాలం వస్తే బరువు పెరుగుతారనేది చాలామంది అభిప్రాయం. సైంటిస్టులు రీసెర్చ్ చేసి చలికి, బరువుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, చలికాలంలో సాధారణంగా కొంచెం బద్ధకం పెరుగుతుంది. ఈ సీజన్ లో కాస్త ఎక్కువ టైం నిద్రపోతారు. వీటి వల్లే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సీజన్లో చలికి చాలామంది వ్యాయామాలు చేయరు. దీంతో బరువు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అయితే చలికాలంలో తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బరువుని కంట్రోల్​ లో  ఉంచే ఫుడ్స్ తో పాటు శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఫుడ్స్ కూడా డైట్లో చేర్చాలి. 

చలికాలం డైట్ ఎలా ఉండాలంటే.. 

చలికాలంలో క్యాలరీలు కరిగించాలన్నా, బరువు తగ్గాలన్నా డైట్ హెల్దీగా ఉండాలి. విటమిన్స్, న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బరువు పెంచే జంక్ ఫుడ్​ తగ్గించాలి. డైట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటే బరువు అంత కంట్రోల్​ లో  ఉంటుంది.

స్నాక్స్ కి బదులు సూప్ 

వింటర్లో బద్ధకంగా ఉండటం వల్ల శరీరానికి తగినంత శ్రమ ఉండదు. దీంతోపాటు స్నాక్స్, జింక్ ఫుడ్స్ లాంటివి తోడైతే తెలియకుండానే చలికాలం ముగిసే సరికి బరువు పెరిగిపోతారు. అందుకే చలికాలంలో ఆయిల్ తో చేసిన స్నాక్స్, జింక్ ఫుడ్స్​ను  తగ్గించాలి. వాటికి బదులు సూప్స్ ని రీప్లేస్ చేయొచ్చు. తినే ముందు సూప్ తాగితే ఎక్కువ తినకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. సూప్స్ లో.. కొన్ని ఫ్యాట్ బర్నింగ్..  లో క్యాలరీ సూపులు ఉంటాయి.  వాటిని స్నాక్స్​లా తీసుకుంటే ఇంకా చాలా మంచిది.  

Also Read : చలికాలంలో పిల్లల కోసం ఈ జాగ్రత్తలు

మార్నింగ్ ముఖ్యం..

ఏ డైట్​ లో అయినా మార్నింగ్​ తీసుకునే ఫుడ్​ కీలకం, ఉదయం మంచివి ఏవైనా తింటే మెటబాలిజం పెరుగుతుంది. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి ముందు కొద్దిపాటి వ్యాయామం చేస్తే.. ఆకలి ఇంకా పెరుగుతుంది. శరీరం క్యాలరీలను కోరుకుంటుంది. అలాంటప్పుడు శరీరానికి కార్బోహైడ్రేట్స్, ప్రొటీనులు ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.

నో ఆల్కహాల్


చలికాలంలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందని అనుకుంటారు. వెచ్చగా ఉండడం ఏమోకానీ ఆల్కహాల్లో ఉండే హై క్యాలరీలు బరువు పెరిగేలా చేస్తాయి. దాంతో పాటు తీసుకునే ఆయిల్ ఫుడ్స్ శరీరంలో కొవ్వుని అమాంతం పెంచేస్తాయి. అందుకే వీలైనంత వరకు చలికాలంలో ఆల్కహాల్​ కు  దూరంగా ఉంటే మంచిది.

ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్

చలికాలంలో వ్యాయామం చేయడం ఇబ్బందిగా అనిపిస్తే బెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్, ఆకుకూరలు లాంటి ఫ్యాట్ బర్నింగ్' ఫుడ్స్ డైట్ లో చేర్చుకుంటే వ్యాయామం చేయకపోయినా కొంతవరకు ఫ్యాట్ కరిగించుకోవచ్చు. వాటితో పాటు బరువును తగ్గించుకోవడానికి ఉడికించి, పచ్చికూరలు, ఆయిల్ తక్కువగా ఉన్నవి డైట్ లో చేర్చుకోవాలి.

అల్లం, హనీ..

వింటర్​లో తీసుకునే ఆహారాల్లో అల్లం చాలా ఇంపార్టెంట్​.. ఎందుకంటే అల్లంలో ఉండే గుణాల వల్ల చలికాలంలో కామన్​ గా వచ్చే జలుబు, ఫ్లూ లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. వింటర్​ లో  రోజూ పొద్దున్నే ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ ఫుడ్స్ జీర్ణం అయ్యి ఎసిడిటీ తగ్గుతుంది. దాంతో పాటు టీలో తేనె కూడా కలిపితే ఇంకా మంచిది. తేనె.. చలికాలంలో వ్యాపించే బ్యాక్టీరియాను తట్టుకునేలా ఇమ్యూనిటీని పెంచుతుంది.

మిల్లెట్స్

వింటర్లో తీసుకోవాల్సిన ఫుడ్స్ లో మిల్లెట్స్ కూడా మంచి ఆప్షన్. మిల్లెట్ తో తక్కువ క్వాంటిటీతో ఎక్కువ పోషకాలు పొందొచ్చు. టిఫిన్, స్నాక్స్ టైంలో మిల్లెట్ వంటలు రెడీ చేసుకుంటే శరీరం లైట్ గా ఉంటూనే బరువు కంట్రోల్ లో ఉంటుంది. మిల్లెట్స్​ లో  ఉండే ఫైబర్, ఖనిజాలు ఎక్కువగా ఆకలి వేయకుండా కంట్రోల్ చేస్తాయి.

ఫ్రూట్స్ విషయంలో...

చలికాలంలో ఫ్రూట్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్ తో ఎలాంటి నష్టం ఉండదు కానీ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినడం వింటర్​లో అంత మంచిది కాదు. వింటర్​ లో  వెచ్చదనం కోసం ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్​ తో  దగ్గు, కోల్డ్ లాంటివి రావొచ్చు.

పల్లీలు, బెల్లం..

వింటర్లో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే వాటిలో వేరుశెనగ ఒకటి. వేరుశెనగ గుండెకు  ఆక్సిజన్ అందే శాతాన్ని పెంచుతుంది. అసలే చలికాలంలో  నిమ్ము వల్ల ఆక్సిజన్ సరిగా అందదు  చాలామందికి.  అలాంటి వాళ్లు డైట్ లో వేరుశెనగ తీసుకుంటే.. ఆక్సిజన్ లెవెల్స్ ను కొంతవరకూ బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే వింటర్లో షుగర్ కి బదులు బెల్లం వాడితే మంచిది. జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఉంటాయి. బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకూ సాయపడుతుంది. 


-వెలుగు, లైఫ్​–