చలికాలం వచ్చిందంటేనే... తినే వాటిలో చాలా మార్పులు వస్తాయి. ఎప్పుడూ ఇష్టంగా తినే చాలా పదార్థాలకు దూరంగా ఉంటారు. అలాంటిది కష్టంగా ఉండే పచ్చిమిర్చిని ఎక్కువమంది పక్కన పెట్టేస్తారు. కానీ, చలికాలంలో పచ్చిమిర్చిని తప్పకుండా తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు, ముఖ్యంగా ఎక్కువ బరువుతో ఇబ్బంది పడేవారు.... పచ్చిమిర్చిని తగిన మోతాదులో తీసుకుంటే మేలు జరుగుతుంది.
అంతేకాకుండా.. ఒబెసిటీతో ఇబ్బంది పడేవారు పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకుంటే మధుమేహం బారిన పడకుండా ఉంటారని తాజా స్టడీలో కూడా వెల్లడైంది.
అందుకే రోజూ క్రమం తప్పకుండా పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకుంటే... శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా ఉండి మధుమేహం దరిచేరదట. పచ్చిమిర్చి తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి, రక్తంలో షుగర్ లెవెల్స్ అరవై శాతం వరకు కంట్రోల్ అవుతాయి. అలాగే పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. గుండెపోటు రాకుండా నివారిస్తుందని నిపుణులు చెప్తున్నారు..
–వెలుగు, లైఫ్–