Winter Health : ఇంట్లోకి చలిగాలి రాకుండా.. వెచ్చదనం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

Winter Health : ఇంట్లోకి చలిగాలి రాకుండా.. వెచ్చదనం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

వెచ్చదనం కోసం చలికాలంలో వెచ్చదనం కోసం స్వె టర్లు వేసుకుంటారు. వేడి ఆహారం, చర్మ సంరక్షణ కోసం క్రీమ్స్ సిద్ధం చేసుకుంటారు. మని ఇంటిని కూడా ఈ కాలానికి తగ్గట్టు మార్చుకుంటే వ్యాధులను కూడా దూరం చేయొచ్చు. 

చలి కాలంలో సాయంత్రం కాగానే కిటికీలను మూసేయడం మంచిది.అలాగే కిటికీ తలుపుల మధ్య చిన్న ఖాళీలున్నా కూడా చల్లగాలి లోపలికి వస్తుంది. అలా కూడా గది వాతావర ణం చల్లబడిపోతుంది. కాబట్టి అలా ఖాళీలున్నచోట మందంగా ఉండే టేపు అంటిస్తే సరిపోతుంది. చలికాలంలో సాధారణంగా మందంగా ఉన్న కర్టెన్స్ వేస్తారు. వాటికంటే కూడా కిటికీలకు, తలుపులకు ముదురు రంగుల్లో ఉండే సిల్క్ కర్టెన్స్ వాడాలి. అవి వేడిని త్వరగా గ్రహిస్తాయి. పగటిపూట వెలుతురు వచ్చే సమయాల్లో కిటికీలు తెరిచి, సాయంత్రం అవగానే మూసేయాలి. అప్పుడే గది వాతావరణం వేడిగా ఉంటుంది.

Also Read :- తెలంగాణలో కంచి ఆలయాన్ని పోలిన ఆలయం ఉంది

బెడ్​రూమ్స్​ లో  పెద్ద కార్పెట్స్ లేకపోతే రాత్రిళ్లు పాత రగ్గులను నేలపై వేయాలి. దానివల్ల గదిలో చల్లదనం ఉన్నా రగ్గుల వల్ల ఎక్కువ చలి అని పించదు. ముఖ్యంగా నడిచేటప్పుడు పాదాలకు చల్లదనం ఉండదు. చిన్న పిల్లలుండే ఇంట్లో అయితే పెద్ద గిన్నెలో నీళ్లు వేడిచేసి దాన్ని గదిలో ఓ మూల ఉంచొచ్చు. కావాలనుకుంటే అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసుకోవచ్చు. ఆ వాసన జలుబు బారి నుంచి కాపాడుతుంది.   గది కూడా వెచ్చగా అనిపిస్తుంది


–వెలుగు, లైఫ్​–