విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ముఖ్యంగా అదానీ అంశంతో పాటు పలు సమస్యలపై ఇండియా కూటమి చర్చకు పట్టుబడుతోంది. ఈ క్రమంలో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని ఆయనపై విపక్షాలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టాయి.
డిసెంబర్ 10న రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని.... అధికార పార్టీకి ఛైర్మన్ వంత పాడుతున్నారని ఆరోపిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (బి) ప్రకారం ఈ తీర్మానంపై సంతకం చేశాయి.
Also Read :- లెదర్ ఇండస్ట్రీ పూర్వ వైభవానికి కృషి చేస్తా
ఈ వింటర్ సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి అదానీ ఇష్యూతో ఉభయ సభల వాయిదాల పర్వం కొనసాగుతోంది. డిసెంబర్ 10న ఉదయం ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్‌ను నిర్వహించేందుకు కాంగ్రెస్ అనుమతించడం లేదని బీజేపీ ఆరోపిస్తుండగా.. ముఖ్యమైన అంశాలను లేవనెత్తడానికి అనుమతించడం లేదని విపక్షాలు ఆరోపించాయి. దీంతో నిరసనల మధ్య ఉభయ సభలు డిసెంబర్ 11కు వాయిదా పడ్డాయి.