Wipro News: ఇప్పట్లో శాలరీ హైక్స్ లేవమ్మా.. టెక్కీలకు షాక్ ఇచ్చిన విప్రో..

Wipro News: ఇప్పట్లో శాలరీ హైక్స్ లేవమ్మా.. టెక్కీలకు షాక్ ఇచ్చిన విప్రో..

Wipro Salary Hikes: దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న విప్రో తాజాగా తన నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. అయితే టీసీఎస్ తర్వాత విప్రో కూడా లాభాల విషయంలో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవటంతో నేడు ఇంట్రాడేలో షేర్ ధర భారీగా క్షీణించింది. ఉదయం 10.35 గంటల సమయంలో 5 శాతానికి పైగా నష్టపోయి రూ.234 వద్ద స్టాక్ ట్రేడింగ్ కొనసాగిస్తోంది. 

ప్రస్తుతం వ్యాపారంలో కొనసాగుతున్న ఒడిదొడుకులను పరిగణలోకి తీసుకుని ఉద్యోగులకు వేతన పెంపులు ఇప్పట్లో ఉండబోవని కంపెనీ స్పష్టం చేసింది. శాలరీ హైక్స్ కు ప్రస్తుతం తాము చాలా దూరంలో ఉన్నామని, సమయం దగ్గరపడినప్పుడు హైక్స్ గురించి ప్రకటన చేస్తామని చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గొవిల్ పేర్కొన్నారు. కంపెనీ చివరిగా సెప్టెంబర్ 2024లో తన ఉద్యోగులకు వేతన పెంపులను అందించింది. అలాగే దానికి ముందు డిసెంబర్ 2023లో హైక్స్ ఇచ్చింది. అంటే ఈసారి కూడా దాదాపు మూడో త్రైమాసికం చివర్లో లేదా లాస్ట్ క్వార్టర్లో హైక్స్ ఊహించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవల రంగం భారీగా ప్రభావితం అయ్యింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్స్ నిర్ణయాలు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయని వారు చెబుతున్నారు. అయితే రానున్న కాలంలో ఇవి ఎలా మార్పులకు లోనవుతాయనే విషయంలో తనకు కూడా స్పష్టత లేదని సీఈవో శ్రీనివాస్ పిళ్లై పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీకి యూరప్, అమెరికాల్లో భారీగా క్లయింట్లు ఉన్నారు. అయితే అమెరికా చైనాపై భారీగా విధిస్తున్న సుంకాలు ఐటీ పరిశ్రమపై ప్రతీకూలతలను చూపివచ్చవని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

అయితే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మెుత్తంగా 10వేల మంది టెక్ ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో వ్యాపార ఒడిదొడుకులు భారీగా ఉండటంతో పాటు ఏఐ ప్రభావం కారణంగా నియామకాల విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాలని కంపెనీ నిర్ణయించింది.