హైదరాబాద్, వెలుగు: లైటింగ్, సీటింగ్ సొల్యూషన్స్ అందించే విప్రో కమర్షియల్ & ఇన్‌స్టిట్యూషనల్ బిజినెస్ (సీఐబీ) ఐఓటీ ఆధారిత ఎక్స్పీరియెన్స్సెంటర్ మై విప్రోవర్స్ను హైదరాబాద్లో ప్రారంభించింది.
2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ షోరూమ్‌లో లైటింగ్, సీటింగ్ సొల్యూషన్స్‌ను ప్రదర్శిస్తారు. స్పేస్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, రియల్టర్లు, కన్సల్టెంట్లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ నిపుణులు, సీఎక్స్ఓలు, వ్యాపారాల యజమానులకు ఇవి అనువుగా ఉంటాయి.
మోడరన్ వర్క్‌ప్లేస్ లైటింగ్, ఇండస్ట్రియల్ లైటింగ్, ఔట్‌డోర్ లైటింగ్, ఎగ్జిక్యూటివ్ సీటింగ్, బోర్డ్‌రూమ్ సీటింగ్, టాస్క్ సీటింగ్, ట్రైనింగ్ జోన్‌లు, కేఫ్ సీటింగ్, స్టేడియం సీటింగ్, ప్రభుత్వ విద్యాసంస్థలకు ఆడిటోరియం సీటింగ్ విమానాశ్రయాలు, రైల్వేలు, ఆసుపత్రులకు పబ్లిక్ సీటింగ్ వంటి సొల్యూషన్లను అందిస్తున్నామని విప్రో కన్స్యూమర్ కేర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనుజ్ ధీర్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి 15 శాతం రెవెన్యూ వస్తోందన్నారు.